
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 68


ఒకే రోజున వస్తున్న నిఖిల్, శిరీష్

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హై లైట్స్

రాజ్ తరుణ్‌కి జోడీగా `అర్జున్ రెడ్డి` భామ?

'విశ్వదర్శనం' కు 'దాదాసాహెబ్ పాల్కే' అవార్డ్

'మహర్షి' ట్రైలర్ రిలీజ్
అప్పట్లో సమంత ప్రశంసలు ఇప్పుడు ఏమవుతుందో..!

ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో?

లిసా రిలీజ్ డేట్ ఫిక్స్

ఫైనల్లీ అర్జున్ సురవరం కు రిలీజ్ డేట్ ఫిక్స్

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో?

యన్టీఆర్ ‘గండికోట రహస్యం’కు 50 ఏళ్ళు

జూన్ నుంచి రానా, సాయిపల్లవి కాంబినేషన్ మూవీ?

జూన్ నుంచి సాయి తేజ్, మారుతి చిత్రం?

నాగ చైతన్య చిత్రంలో కార్తికేయ?

చిరు, నాగ్, వెంకీ బాటలో మహేష్ కూడా వెళతాడా?
మే 9, 2019… సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండుగ రోజు అని చెప్పాలి. ఎందుకంటే… ఆ రోజు తమ అభిమాన హీరో నటించిన ‘మహర్షి’ విడుదలయ్యే రోజు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఇటు అభిమానులతో పాటు… అటు సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే… మే 9వ తేదీకి, తెలుగు సినీ అగ్ర కథానాయకుల చిత్రాలకి విడదీయరాని బంధం ఉంది.ఎందుకంటే… ఇదే తేదిన కొందరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వేర్వేరు సంవత్సరాల్లో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

ఒకే రోజున వస్తున్న నిఖిల్, శిరీష్
ఒకే రోజున ఇద్దరు యువ కథానాయకులు తమ తమ కొత్త సినిమాలతో సందడి చేయడానికి సిధ్ధపడుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ మూవీస్ కావడం విశేషం. ఆ ఇద్దరు యువ కథానాయకులు… నిఖిల్, అల్లు శిరీష్ కాగా… ఆ సినిమాలు అర్జున్ సురవరం, ఏబీసీడీ.

దర్శకుడిగా పుష్కరకాలం పూర్తిచేసుకున్న వంశీ పైడిపల్లి
రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ తరం దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మున్నా(2007) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన వంశీ… అనంతరం బృందావనం, ఎవడు, ఊపిరి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. ఇక… ఐదో చిత్రంగా తెరకెక్కిన మహర్షి మే 9న విడుదలకు సిద్ధంగా ఉంది.

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హై లైట్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1వ తేదీ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి. సక్సెస్ ఫుల్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు, రైటర్ శ్రీమణి, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, నటులు పోసాని, రాజీవ్ కనకాల, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

రాజ్ తరుణ్‌కి జోడీగా `అర్జున్ రెడ్డి` భామ?
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేకి దక్కిందని టాలీవుడ్ టాక్. నటనకు అవకాశమున్న పాత్ర కావడంతో యూనిట్… షాలిని వైపు మొగ్గు చూపిందని తెలుస్తోంది. వాస్తవానికి… షాలిని కంటే ముందు ఈ పాత్ర కోసం అవికా గోర్, హెబ్బా పటేల్ వంటి కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే… చివరాఖరికి ఆ అవకాశం షాలినికి దక్కిందని సమాచారం…

'విశ్వదర్శనం' కు 'దాదాసాహెబ్ పాల్కే' అవార్డ్
సంగీతం.. సాహిత్యం.. నృత్యం అనే మూడు అంశాలను కీలకం చేసుకొని సినిమాలు తీసి వహ్ వా అనిపించుకున్న సంగీత దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. అలాంటి లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో కె. విశ్వనాథ్ గారి బయోపిక్ ను తెరకెక్కిస్తుండగా… మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా.. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేశారు.

'మహర్షి' ట్రైలర్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ 'మహర్షి' మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
అప్పట్లో సమంత ప్రశంసలు ఇప్పుడు ఏమవుతుందో..!
తమిళ సినిమా 'గోలి సోడా'కు రీమేక్ గా తెలుగులో వస్తున్న సినిమా 'ఎవడు తక్కువ కాదు'. తెలుగులో రీమేక్ చేస్తున్న ఈసినిమాతో 'రేసుగుర్రం', 'పటాస్', 'రుద్రమదేవి', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాల్లో ఆర్టిస్టుగా నటించిన సహిదేవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది 'ఎవడు తక్కువ కాదు'. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మే 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో?
ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గరనుండి రోజుకో వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. రూమర్లు మరీ ఎక్కువవుతున్న నేపథ్యంలో… చిత్రయూనిట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చింది. ఆ తరువాత ఈ రూమర్లకు కాస్త బ్రేక్ పడినా.. మళ్లీ ఏదో ఒక విషయంలో రోజుకో గాసిప్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ పక్కన సెలక్ట్ చేసిన హాలీవుడ్ నటి తప్పుకోవడంతో… అప్పుడే ఎన్టీఆర్ సరసన ఇద్దరు నాయికలు కనిపించనున్నారని.. అందులో ఒక నాయికగా నిత్యామీనన్ నటిస్తుందని.. ఓగిరిజన పాత్ర పోషిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నాలుగు కార్యక్రమాలు
మే 4న శతాధిక చిత్ర దర్శకుడు, దివంగత దిగ్దర్శకుడు, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ లో నాలుగు ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి.

లిసా రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పటికే నాయిక ప్రాధాన్యత కలిగిన గీతాంజలి, చిత్రాంగథ చిత్రాలతో మెప్పించిన అంజలి మరోసారి అదే జోనర్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో 'లిసా' అనే సినిమా రూపొందుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి.

ఏపీలో రిలీజ్ కు కష్టాలు - మళ్లీ ఆగిపోయిన లక్ష్మీస్ ఎన్టీఆర్
ప్రపంచ వ్యాప్తంగా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఏపీలో రిలీజ్ కు నోచుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఏపీలో ఎన్నికల ముందే సినిమా రిలీజ్ చేయాలని చూసినా.. ఎన్నికల తరువాతే రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఇక ఈరోజు ఏపీలో సినిమా రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఈరోజు కూడా రిలీజ్ కు నోచుకోలేదు ఈ సినిమా. ఈరోజు ఎలాగైనా సరే ఈసినిమాను ఏపీలో రిలీజ్ చేయాలని వర్మ ఎంతో పట్టుదల చూపించినా, అధికారులు ససేమిరా అంటున్నారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని ఏపీలోని థియేటర్ల నుంచి సినిమా తొలగించినట్టు తెలుస్తోంది.

ఫైనల్లీ అర్జున్ సురవరం కు రిలీజ్ డేట్ ఫిక్స్
ఎట్టకేలకు అర్జున్ సురవరం సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎఫెక్ట్ వల్ల చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సివచ్చింది. ఫైనల్ గా ఈనెల 17వ తేదీన అర్జున్ సురవరం సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

20ఏళ్ళలో 25 - రాజకుమారుడు నుండి మహర్షి దాకా మహేష్ బాబు ప్రస్థానం
సాధారణంగా ఒక స్టార్ కాంపౌండ్ నుండి ఒక నట వారసుడు పరిచయం అవుతున్నాడు అంటే అంచనాలు ఎంత గొప్పగా ఉంటాయో .. సందేహాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కానీ "రాజకుమారుడు" చిత్రం ద్వారా సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు పరిచయం అవుతున్నప్పుడు మాత్రం అతని సక్సెస్ పట్ల ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. కారణం అంతకుముందే most successful చైల్డ్ ఆర్టిస్ట్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు మహేష్ బాబు.

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో?
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా తక్కువ టైంలోనే ఆయన 50 సినిమాలకు పైగా పూర్తి చేశాడు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లతో దూసుకుపోయిన నరేష్ ఆ తరువాత వరుస పరాజయాలతో వెనుకపడిపోయాడు. కొంతకాలంగా సరైన హిట్ పడలేదు.

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా అగ్ర హీరో, యంగ్ హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లి సినిమా 'మహర్షి' రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది.. మహేష్ అభిమానుల్లో ఉత్సుకత కూడా ఎక్కువవుతుంది. గత కొద్ది కాలం నుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగిస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో సాయంత్రం 6గంటలకు గ్రాండ్ గా జరుగనుంది.

యన్టీఆర్ ‘గండికోట రహస్యం’కు 50 ఏళ్ళు
మహానటుడు స్వర్గీయ యన్.టి.రామారావు, జానపద బ్రహ్మ బి.విఠలాచార్య కలయికలో పలు జానపద చిత్రాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. వాటిలో ‘గండికోట రహస్యం’ ఒకటి. “ప్రజలే ప్రభువులు” అన్న మహోన్నతమైన సందేశంతో తెరకెక్కిన చిత్రమిది. యన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో జయలలిత, దేవిక కథానాయికలుగా నటించారు. డి.వి.యస్.ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.యస్.రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజనాల, మిక్కిలినేని, రాజబాబు, అల్లు రామలింగయ్య, హేమలత, రమాప్రభ, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు.

జూన్ నుంచి రానా, సాయిపల్లవి కాంబినేషన్ మూవీ?
రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో ‘విరాటపర్వం 1992’ పేరుతో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల… ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో… రానా విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం… ఈ సినిమాకి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం… జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ టాక్.

జూన్ నుంచి సాయి తేజ్, మారుతి చిత్రం?
‘చిత్రలహరి’ అందించిన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు మెగా హీరో సాయితేజ్. ఈ నేపథ్యంలో… తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా… తాజాగా యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయితేజ్. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం.

నాగ చైతన్య చిత్రంలో కార్తికేయ?
‘ప్రేమతో మీ కార్తీక్’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు కార్తికేయ. అయితే… గత ఏడాది నూతన దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘RX 100’తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఒకవైపు హీరోగా నటిస్తూనే… మరోవైపు కీలక పాత్రల్లోనూ నటించడానికి కార్తికేయ ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో… తనకు నటుడిగా మంచి బ్రేక్ ఇచ్చిన అజయ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే హీరోగా కాకుండా… అతిథి పాత్రలో నటిస్తున్నాడట.