మే 9, 2019… సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండుగ రోజు అని చెప్పాలి. ఎందుకంటే… ఆ రోజు తమ అభిమాన హీరో నటించిన ‘మహర్షి’ విడుదలయ్యే రోజు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఇటు అభిమానులతో పాటు… అటు సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే… మే 9వ తేదీకి, తెలుగు సినీ అగ్ర కథానాయకుల చిత్రాలకి విడదీయరాని బంధం ఉంది.ఎందుకంటే… ఇదే తేదిన కొందరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వేర్వేరు సంవత్సరాల్లో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… 1990 మే 9… మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైన రోజు. సోషియో – ఫాంటసీ ఫిల్మ్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా… అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలచింది. అలాగే… 1991లో మరోసారి ఇదే డేట్‌ని టార్గెట్ చేస్తూ… చిరు నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా విడుదలయ్యింది. విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసి… చిరుకి మరో ఇండస్ట్రీ హిట్‌ను అందించింది. కట్ చేస్తే… ఆరేళ్ళ తర్వాత మే 9వ తేదీ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ… విక్టరీ వెంకటేష్, దర్శకుడు జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమించుకుందాం…రా!’ తెరపైకి వచ్చింది.
1997 మే 9న విడుదలైన ఈ చిత్రం… అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక 2002లో మరోసారి మే 9వ తేదీ టార్గెట్‌గా… కింగ్ నాగార్జున, దర్శకుడు దశరథ్ కలయికలో తెరకెక్కిన ‘సంతోషం’ విడుదలైంది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో విజయకేతనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో… ఇప్పుడు మహేష్ నటించిన ‘మహర్షి’ కూడా మే 9వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానుండడంతో… అగ్ర హీరోలైన చిరు, నాగ్, వెంకీకి కలిసొచ్చిన మే 9 సెంటిమెంట్… మహేష్‌కు కూడా వర్కవుట్ ఇండస్ట్రీకి మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందిస్తుందేమో చూడాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్
రాజు, సి.అశ్వనీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు.
[subscribe]
[youtube_video videoid=o_UlEi8Lv10]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: