మే 4న శతాధిక చిత్ర దర్శకుడు, దివంగత దిగ్దర్శకుడు, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ లో నాలుగు ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
1)
ఈరోజు మే 1… దర్శకరత్న కు – సినీ కార్మికులకు మధ్య ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని “దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్ – 2019” – కార్యక్రమాన్ని భారత్ ఆర్ట్స్ అకాడమీ – ఏ బి సి ఫౌండేషన్ – భీమవరం టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత నటుడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, భారత్ ఆర్ట్స్ అకాడమీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు రమణ రావు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తికి “దాసరి జీవిత సాఫల్య పురస్కారం”, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కు “దాసరి ఎక్సలెన్సీ అవార్డు”, ప్రముఖ సినీ దంపతులు రాజశేఖర్ – జీవితలకు దాసరి నారాయణరావు – దాసరి పద్మ మెమోరియల్ అవార్డు ప్రధానం చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో తొలి చిత్రంలోనే అద్భుత ప్రతిభ కనపరిచిన నలుగురు యువ దర్శకులు గౌతమ్ తిన్ననూరి, వేణు ఉడుగుల, శశికిరణ్ తిక్క, వెంకటేష్ మహా లకు “దాసరి టాలెంటెడ్ డైరెక్టర్” అవార్డులు ఇవ్వనున్నారు. వీటితోపాటు చిత్రపరిశ్రమలోని వివిధ శాఖలకు చెందిన సీనియర్స్ , దాసరితో అనుబంధం కలిగిన టెక్నీషియన్స్ కు” దాసరి మెమోరియల్ సినీ అవార్డులు” బహూకరించనున్నారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ కురువృద్ధులు కొణిజేటి రోశయ్యతో పాటు రెండు రాష్ట్రాల చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ ల అధ్యక్షులు అంబికా కృష్ణ, రామ్మోహన్రావు , ప్రముఖ నిర్మాత, నటులు, ఎంపీ మురళీమోహన్, తదితర సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
2) విద్య విలువ తెలిసిన దాసరి నారాయణరావు ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇచ్చి ప్రోత్సహించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన కుమార్తె శ్రీమతి హేమలయ కుమారి, అల్లుడు డాక్టర్ రఘునాథ్ బాబులు “శ్రీ దాసరి నారాయణ రావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమోరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్” స్థాపించి తొలిసారిగా ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్పులు ఇస్తున్నారు. తొలి సంవత్సరం దాసరి నారాయణ రావు వద్ద పర్సనల్ స్టాఫ్ గా పనిచేసిన వ్యక్తుల పిల్లలకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున ఆరుగురికి స్కాలర్షిప్పులు అందజేస్తున్నారు చేస్తున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం( మే 2) హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరుగుతుంది. దాసరి కుటుంబ సభ్యులతో పాటు దాసరి సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
3) గత సంవత్సరమే దాసరి జన్మదినాన్ని” డైరెక్టర్స్ డే” గా ప్రకటించిన తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఈ సంవత్సరం కూడా దాసరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మే 4 సాయంత్రం 5 గంటలకు ఫిలిం నగర్ లోని ఎఫ్.ఎన్.సి.సి. క్లబ్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.
4)
నూతన ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించే నిమిత్తం దాసరి నారాయణరావు తన జన్మదినం సందర్భంగా షార్ట్ ఫిలిం contests నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పరంపరను కొనసాగిస్తూ దాసరి సన్నిహితులు , ఆయన ఫైనాన్షియల్ అడ్వైసర్ బి ఎస్ ఎన్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో “దాసరి మెమోరియల్ షార్ట్ ఫిలిం contest” నిర్వహించి మే 5వ తేదీన ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. దాసరి ప్రియ శిష్యులు ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త డాక్టర్ మంచు మోహన్ బాబు, సహజ నటి జయసుధ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.
ఈ విధంగా దాసరి నిష్క్రమణ తర్వాత కూడా ఆయన చేపట్టిన కార్యక్రమాలను యధార్థ స్ఫూర్తితో కొనసాగటం ఆ శతాధిక దర్శక శిఖరం చేసుకున్న పూర్వ జన్మ పుణ్యం అనే చెప్పాలి. ఎంత గొప్ప వాళ్ళు పోయినప్పటికీ మరుసటి రోజు న తలచుకునే వాళ్లు లేకుండా పోతున్న ఈ రోజుల్లో దర్శకరత్న దాసరి కి ఇంత ఘన నివాళి దక్కడం నిజంగా ఆయన పూర్వజన్మ సుకృతమే.
[subscribe]
[youtube_video videoid=-nXiS0Itmgo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: