ఇప్పటికే నాయిక ప్రాధాన్యత కలిగిన గీతాంజలి, చిత్రాంగథ చిత్రాలతో మెప్పించిన అంజలి మరోసారి అదే జోనర్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో ‘లిసా’ అనే సినిమా రూపొందుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నెల 24వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
కాగా పీజీ మీడియా వర్క్స్ బ్యానర్‌పై పీజీ ముత్తయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశంలోనే మొదటి సారిగా స్టీరియోస్కోపిక్ 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న హార్రర్ పిక్చర్ ఇదే కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా తనకు మంచి హిట్ ఇస్తుందనే నమ్మకంతోనే అంజలి ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో.. ‘లీసా’ మూవీతో అంజలి ఎలా దడపుట్టిస్తుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=aqCG1Y0R-nQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: