
ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 9


యూరోప్ , వియత్నాం లలో "దైవం మనుష్య రూపేణా "

కండలు తిరిగిన దేహం తో "ఏజెంట్ "

అఖిల్ 'ఏజెంట్' షూటింగ్ స్టార్ట్

వరస మూవీస్ తో పవన్ కళ్యాణ్ బిజీ

'గని' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

థియేటర్స్ లోనే "గల్లీ రౌడీ "

బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్

కృష్ణపట్నం పోర్ట్ లో "ఏజెంట్ "

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ

విశ్వక్ సేన్ లేటెస్ట్ ఫొటో

హన్సిక కొత్త చిత్రం ప్రారంభం

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా

ఆగస్ట్ లో "#RC15" ప్రారంభం

పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్

పవన్ కోసం కథ రాయడానికి వెయిట్ చేస్తున్నా

మేకర్స్ తో ధనుష్ మీటింగ్

బిజీ బిజీగా అవికా గోర్

"ఆచార్య "మూవీ అప్ డేట్

నాపై వచ్చిన వార్తల్లో నిజం లేదు..

ఫైనల్ షెడ్యూల్ లో 'అన్నాత్తే '
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అన్నాత్తే”. కోవిడ్ కారణంగా.. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయినా కూడా సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఎలాగైనా ముగించాలని అనుకున్న చిత్రబృందం.. అన్ని కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ.. హైద్రాబాద్ షెడ్యూల్ ను మాత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది

యూరోప్ , వియత్నాం లలో "దైవం మనుష్య రూపేణా "
విభిన్న కథా చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ , స్వాతి జంటగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 "తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో షూటింగ్ జరుపుకున్న "కార్తికేయ 2 " మూవీ ఆగస్ట్ నుండి యూరప్, వియత్నాం వంటి దేశాల్లో చిత్రీకరణ కు దర్శకుడు ప్లాన్ చేశారు.

కండలు తిరిగిన దేహం తో "ఏజెంట్ "
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

అఖిల్ 'ఏజెంట్' షూటింగ్ స్టార్ట్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని 5వ చిత్రంగా “ఏజెంట్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇవ్వనున్నాడు. ఇప్పటి వరకూ అఖిల్ చేసిన మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా మూడు సినిమాల్లో లుక్స్ పరంగా పెద్దగా ఎలాంటి చేంజ్ చూపించలేదు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ ను ఇంతకు ముందెన్నడూ ప్రేక్షకులు చూడని స్టైలిష్ లుక్ లో చూపించనున్నట్టు ఇప్పటికే అఖిల్ మేకోవర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక తాజాగా ఏజెంట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గడంతో అందరూ షూటింగ్‌లను ప్రారంభించేశారు. అఖిల్ ఏజెంట్ కూడా సెట్స్ మీదకు అడుగుపెట్టేసింది…

వరస మూవీస్ తో పవన్ కళ్యాణ్ బిజీ
దాదాపు 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వరస మూవీ కమిట్ మెంట్స్ తో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. “హరిహర వీరమల్లు “ మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది.

'గని' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం
వరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమా షూట్ కు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న వరుణ్ ఫైనల్ రౌండ్ కు రెడీ అయ్యాడు. ఈరోజు నుండి గని ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఈవిషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియచేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

థియేటర్స్ లోనే "గల్లీ రౌడీ "
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం "నరగాసురన్ ", "కసడ తపర "(తమిళ ), "వివాహభోజనంబు" (తెలుగు ) మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన "గల్లీ రౌడీ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగా "గల్లీ రౌడీ " మూవీ తెరకెక్కింది. బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు.

బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్
చదువుకునే రోజుల్లో సింగింగ్ , డ్యాన్సింగ్ , పియానో నేర్చుకున్న కేథరిన్ నల్లి సిల్క్స్ , చెన్నై సిల్క్స్ వంటి పలు సంస్థలకు మోడలింగ్ చేశారు. "శంకర్ ఐ పి ఎస్ "(2010 ) కన్నడ మూవీ తో కేథరిన్ కెరీర్ ప్రారంభించారు. "ది థ్రిల్లర్ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు ,"చమ్మక్ ఛలో "మూవీ తో టాలీవుడ్ , "మద్రాస్ "మూవీ తో కోలీవుడ్ కు కేథరిన్ కథానాయికగా పరిచయం అయ్యారు.

కృష్ణపట్నం పోర్ట్ లో "ఏజెంట్ "
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

విశ్వక్ సేన్ లేటెస్ట్ ఫొటో
“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” “ఫలక్ నుమా దాస్”, మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఫలక్ నుమా దాస్”మూవీ కి విశ్వక్ సేన్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం వహించడం విశేషం. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.హీరో విశ్వక్ సేన్ ఫొటో షూట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

హన్సిక కొత్త చిత్రం ప్రారంభం
బాలనటిగా బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన హన్సిక "ఆప్ కా సురూర్" మూవీ తో కథానాయికగా మారారు. సూపర్ హిట్ "దేశముదురు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక సూపర్ హిట్ "మాప్పిళ్ళై "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో హన్సిక ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో బిజీగా మారడంతో అప్పుడప్పుడూ తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. హన్సిక ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాను పట్టాలెక్కించనుండగా రామ్ చరణ్ శంకర్ తో సినిమాను చేయనున్నాడు. అయితే చరణ్-శంకర్ సినిమాను ఎప్పుడో ప్రకటిచినప్పటికీ మధ్యలో లైకా వివాదం రావడంతో ఈసినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు. తమ ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసిన తరువాతే శంకర్ వేరే సినిమాను చేయాలన్న కండీషన్ పెట్టింది. ఇక దీనిపై వాదించిన కోర్టు కూడా మీరు మీరు తేల్చుకోవాలని చెప్పినా కూడా అవేమీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గానే ఈసినిమాకు కోర్టు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. శంకర్…

ఆగస్ట్ లో "#RC15" ప్రారంభం
సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , "మగధీర“, రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.

పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్
ఈ ఏడాది మార్చిలో హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ తో మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేసుకున్నారు. నార్మల్ పరిస్థితులు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలీదు కానీ తాజాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహ్రీన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చింది.

పవన్ కోసం కథ రాయడానికి వెయిట్ చేస్తున్నా
పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా పవన్ కు ఉండే చరిష్మా మాత్రం సెపరేట్ అని చెప్పొచ్చు. అందుకే పవన్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక కల లాగ అనుకుంటాడు. రాజమౌళి లాంటి డైరెక్టరే పవన్ కళ్యాణ్ స్థాయికి కథను సిద్దం చేయడం, తెరకెక్కించడం మామూలు విషయం కాదని అన్నాడంటేనే అర్థంచేసుకోవచ్చు పవన్ తో సినిమా తీయాలంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో.

మేకర్స్ తో ధనుష్ మీటింగ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఈసినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనాగచైతన్యహీరోగా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద నారాయణదాస్ కె నారంగ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇదే బ్యానర్ లో శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా తీయనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా తెరకెక్కనుంది…

బిజీ బిజీగా అవికా గోర్
సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “సినిమా చూపిస్త మావ “, “ఎక్కడికి పోతావుచిన్నవాడా “మూవీస్ లో అవికా గోర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ దర్శక , నిర్మాతలు పలు అవకాశాలు ఇచ్చినా , అవికాగోర్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.

"ఆచార్య "మూవీ అప్ డేట్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్…

నాపై వచ్చిన వార్తల్లో నిజం లేదు..
కమర్షియల్ సినిమాలకు కామెడీ యాంగిల్ ను జోడించి ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్లలో శ్రీనువైట్ల పేరు ముందే ఉంటుంది. తన సినిమాల్లో ఉండే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఉన్నా ఇప్పుడు మాత్రం కాస్త స్లోఅయ్యాడు. దానికి వరుసపరాజయాలే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు చాాలా గ్యాప్ తరువాత మళ్లీ ఢీ సీక్వెల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించారు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది.ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.