పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా పవన్ కు ఉండే చరిష్మా మాత్రం సెపరేట్ అని చెప్పొచ్చు. అందుకే పవన్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక కల లాగ అనుకుంటాడు. రాజమౌళి లాంటి డైరెక్టరే పవన్ కళ్యాణ్ స్థాయికి కథను సిద్దం చేయడం, తెరకెక్కించడం మామూలు విషయం కాదని అన్నాడంటేనే అర్థంచేసుకోవచ్చు పవన్ తో సినిమా తీయాలంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. తాజాగా పవన్ కోసం విజయేంద్ర ప్రసాద్ ఒక కథను రెడీ చేస్తున్నాడని వార్తలు వస్తు
న్న సంగతి తెలిసిందే ఇక ఈ వార్తలపై విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ… ఆ వార్తల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ తనను ఎవరూ సంప్రదించలేదని.. కానీ తాను కూడా పవన్ కోసం స్టోరీ రాయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని తెలిపాడు. మరి చూద్దాం దీంతో ఇప్పుడైనా ఎవరైనా విజయేంద్ర ప్రసాద్ ను పవన్ కు స్టోరీ కోసం అడుగుతారేమో..
ఇక ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ పలు సినిమాలకు కథలు అందిస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్ ‘తలైవి’ కు కథను అందించారు. ఇంకా తనయుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ కు అలాగే హిందీలో ‘సీత’ చిత్రాలకు విజయేంద్రప్రసాద్ రచయితగా వ్యవహరిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: