
ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 8


సెప్టెంబర్ లో"#RC15"

'ఖిలాడి' షెడ్యూల్ లో మార్పు

"ఆదిపురుష్ "50 రోజుల షూటింగ్ పూర్తి

జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ

స్పీడుమీదున్న 'బాలయ్య'

ఆగస్ట్ లో సెట్స్ పైకి "బంగార్రాజు "

చిరు సినిమాలో సముద్రఖని..!

విశ్వక్ సేన్ కొత్త సినిమా అప్ డేట్

తమన్నా బ్యూటీ సీక్రెట్

కృతి శెట్టి 3 న్యూ మూవీస్ అనౌన్స్ మెంట్

'గూఢచారి 2' లేటుకు నేనే కారణం

ఆగష్ట్ లో 'పాగల్' రిలీజ్ ప్లాన్

టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం

"ముగ్గురు మొనగాళ్ళు "రిలీజ్ డేట్ ఫిక్స్

కె.వి గుహన్ తో ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ ప్రారంభం

"మేజర్ "మూవీ విడుదల పై క్లారిటీ

'నరసింహపురం' టీమ్ పై ప్రకాష్ రాజ్ ప్రశంసలు

అభిమానులు కాలర్ ఎగరేసేలా "హరిహర వీర మల్లు "
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో “PSPK 28 ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెప్టెంబర్ లో"#RC15"
సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.

'ఖిలాడి' షెడ్యూల్ లో మార్పు
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇంకా ఈసినిమాలో రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు పెండింగ్ లో ఉండగా దానికోసం దుబాయ్ లో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఆగష్ట్ ఫస్ట్ వీక్ నుండి ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ ను మార్చినట్టు తెలుస్తుంది. కరోనా వల్ల ఇంకా వీసా పర్మిషన్స్ రాకపోవడంతో ఇక్కడే సెట్స్ వేసి సాంగ్స్ వరకూ ఇక్కడే షూటింగ్ చేయాలని చూస్తున్నారట. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం దుబాయ్ లోనే షూట్ చేయనున్నారు

'7 డేస్ 6 నైట్స్' ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్
డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

"ఆదిపురుష్ "50 రోజుల షూటింగ్ పూర్తి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో 300 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ కథానాయికగా రూపొందిన 4 హిందీ , 2 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. “కే 13” మూవీ ఫేమ్ భరత్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఏలియన్స్ నేపథ్యం లో ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని జీ…

స్పీడుమీదున్న 'బాలయ్య'
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు ఒక్క సినిమాలు చేస్తుంటే వీళ్లు మాత్రం ఒక్కోక్కరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.ఈసినిమాత తరువాత గోపిచంద్ మలినేని తో మరొక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు గోపిచంద్ మలినేని. అఖండ అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఆగస్ట్ లో సెట్స్ పైకి "బంగార్రాజు "
కింగ్ నాగార్జున హీరో గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు “సోగ్గాడే చిన్నినాయనా “మూవీకి సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కనుంది.

చిరు సినిమాలో సముద్రఖని..!
మొత్తానికి టాలీవుడ్ లో తమిళ నటీనటులను బాగానే వాడుతున్నారు. ముఖ్యంగా సముద్రఖని లాంటి వారిని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు సముద్రఖని. ఇక ఇప్పుడు మరో సినిమాలో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరు సినిమాలో. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పనిలో పడ్డాడు. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

విశ్వక్ సేన్ కొత్త సినిమా అప్ డేట్
“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” మూవీ తో గుర్తింపు పొందారు. సూపర్ హిట్ “ఫలక్ నుమా దాస్” తో విశ్వక్ దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన “పాగల్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

తమన్నా బ్యూటీ సీక్రెట్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

కృతి శెట్టి 3 న్యూ మూవీస్ అనౌన్స్ మెంట్
క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచిన కృతిశెట్టి బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కృతిశెట్టి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

'గూఢచారి 2' లేటుకు నేనే కారణం
విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడింది. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.

ఆగష్ట్ లో 'పాగల్' రిలీజ్ ప్లాన్
యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘పాగల్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక కరోనా కారణంగా పాగల్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేటర్ల ఓపెన్ అయిన వెంటనే రానుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు లైన్ లో ఉండగా.. ఈ సినిమాను కూడా తొందరగానే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆగష్ట్ ఫస్ట్ వీక్ లేేదా సెకండ్ వీక్ లో సినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ చూస్తున్నట్టు…

టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం
చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా స్టార్ చిరంజీవి , విజయ్ దేవరకొండ , నిఖిల్ , విశ్వక్ సేన్ వంటి వారు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అనే యువనటుడు ఆకోవకు చెందుతారు. "రాజాగారు రాణివారు " వంటి చిన్న సినిమాతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన కిరణ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు.

"ముగ్గురు మొనగాళ్ళు "రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీనివాస్ రెడ్డి ఓవైపు హాస్యనటుడిగా సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు హీరోగా కూడా చేస్తున్నారు. 'గీతాంజలి' 'జయమ్ము నిశ్చయమ్మురా' వంటి సినిమాలలో హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వం లో ''ముగ్గురు మొనగాళ్లు'' అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి తో పాటుగా ఈ చిత్రంలో 'దియా' ఫేమ్ దీక్షిత్ శెట్టి - వెన్నెల రామారావు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి…

కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పటికే SR కళ్యాణమండపం సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కిరణ్ చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై దాదాపు చివరి దశకు వచ్చేసింది.

కె.వి గుహన్ తో ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ ప్రారంభం
విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా దొరసాని తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మిడిల్క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక మొదటి నుండి కాస్త డిఫరెంట్ సినిమాలు ఎంపిక చేసుకునే ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ‘హైవే’ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి ప్రారంభమైంది.

"మేజర్ "మూవీ విడుదల పై క్లారిటీ
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

'నరసింహపురం' టీమ్ పై ప్రకాష్ రాజ్ ప్రశంసలు
పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా 'శ్రీరాజ్ బళ్లా' 'నరసింహపురం' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా బృందంపై ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఘన విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. కరోన ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి "నరసింహపురం" చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్న హీరో-దర్శకనిర్మాతలను ఎంతైనా అభినందించేయాల్సిందేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. పరిశ్రమ పచ్చగా కలకళలాడాలంటే "నరసింహపురం" వంటి మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ విజయాలు సాధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.