బాలనటిగా బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన హన్సిక “ఆప్ కా సురూర్” మూవీ తో కథానాయికగా మారారు. సూపర్ హిట్ “దేశముదురు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక సూపర్ హిట్ “మాప్పిళ్ళై “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో హన్సిక ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో బిజీగా మారడంతో అప్పుడప్పుడూ తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. హన్సిక ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న “మై నేమ్ ఈజ్ శృతి ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ .. తెలుగు సినిమాతోనే కథానాయికగా నా ప్రయాణం ఆరంభమైంది. నటిగా ఎంతో పేరుతీసుకొచ్చిన తెలుగు చిత్రసీమలో తాను చేయబోతున్న మరో మంచి సినిమా ఇదనీ , తాను కథానాయికగా నటిస్తున్న 52వ చిత్రమిదనీ , ఇందులో స్వతంత్ర భావాలు కలిగిన శృతి అనే అమ్మాయిగా తన పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుందనీ , .మహిళా ప్రధాన కథాంశంతో సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సినిమా ఇదనీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్ అందిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: