యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం “నరగాసురన్ “, “కసడ తపర “(తమిళ ), “వివాహభోజనంబు” (తెలుగు ) మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన “గల్లీ రౌడీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగా “గల్లీ రౌడీ ” మూవీ తెరకెక్కింది. బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గల్లీ రౌడీ ” మూవీ OTT లో రిలీజ్ కానుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సందీప్ కిషన్ స్వయంగా ఆ వార్తలను ఖండించారు. “గల్లీ రౌడీ” OTT లో రిలీజ్ కాదనీ , నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తున్నామనీ చెప్పారు. “గల్లీ రౌడీ” థియేటర్లలో మాత్రమే ఆస్వాధించాల్సిన చిత్రం అనీ అన్నారు. కరోనా కష్ట సమయంలో థియేటర్ యజమానులకు సహాయం చేసేందుకు నిర్మాత కోన వెంకట్ థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపినందుకు ఆయనకు సందీప్ కృతజ్ఞతలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: