సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , “మగధీర“, రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది.హీరో రామ్ చరణ్ కై దర్శకుడు ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు , హీరో రామ్ చరణ్ ఒక డైనమిక్ రోల్ లో నటించనున్నారని సమాచారం. హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈమూవీ ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్ళనుందనీ , కియారా అద్వానీ టాలీవుడ్ కు రీఎంట్రీ కానున్నట్టు సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి .
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: