యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పటికే SR కళ్యాణమండపం సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కిరణ్ చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై దాదాపు చివరి దశకు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గడ్డంతో కిరణ్ హ్యాండ్‌సమ్ కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రానున్నట్టు అర్థమవుతుంది.
కాగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫర్. ఈసినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: