‘నరసింహపురం’ టీమ్ పై ప్రకాష్ రాజ్ ప్రశంసలు

Actor Prakash Raj Is All Praises For Narasimhapuram Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Prakash Raj,Actor Prakash Raj,Prakash Raj Latest News,Prakash Raj Movie Updates,Prakash Raj Updates,Prakash Raj Movie News,Prakash Raj Latest Film Updates,Prakash Raj News,Prakash Raj Movies,Prakash Raj New Movie,Prakash Raj Latest Movie,Prakash Raj Praises Narasimhapuram Movie Team,Prakash Raj Praises For Narasimhapuram Movie Team,Prakash Raj Praises Narasimhapuram Team,Actor Prakash Raj Praises Narasimhapuram Movie Team,Narasimhapuram,Narasimhapuram Movie,Narasimhapuram Telugu Movie,Narasimhapuram Movie Updates,Narasimhapuram Movie Latest Updates,Narasimhapuram Movie Latest News,Narasimhapuram Movie Team,Prakash Raj About Narasimhapuram Movie,Narasimhapuram Movie New Update,Prakash Raj Upcoming Movies,Prakash Raj New Movie Updates

పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా ‘శ్రీరాజ్ బళ్లా’ ‘నరసింహపురం’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా బృందంపై ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఘన విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. కరోన ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి “నరసింహపురం” చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్న హీరో-దర్శకనిర్మాతలను ఎంతైనా అభినందించేయాల్సిందేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. పరిశ్రమ పచ్చగా కలకళలాడాలంటే “నరసింహపురం” వంటి మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ విజయాలు సాధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నందకిషోర్ మాట్లాడుతూ… “ప్రకాష్ రాజ్ గారు లాంటి గొప్ప నటుడు మాకు సమయమిచ్చి మా సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసి… చాలా బాగుందని మెచ్చుకోవడం మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెంచింది. ఆయనకు మా యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. “నరసింహపురం” చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపాడు.

కాగా గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ‘ సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుంది. కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఫ్రాంక్లిన్ సుకుమార్ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =