కె.వి గుహన్ తో ఆనంద్‌ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ ప్రారంభం

Anand Deverakonda Kickstarts His New Movie With Director KV Guhan,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Anand Deverakonda,Actor Anand Deverakonda,Hero Anand Deverakonda,Anand Deverakonda New Movie,Anand Deverakonda Movies,Anand Deverakonda Latest Movie,Anand Deverakonda Next Movie,Anand Deverakonda Upcoming Movie,Anand Deverakonda Next Project,Anand Deverakonda New Movie Highway,KV Guhan,Venkat Talari,Anand Deverakonda New Movie Shooting,Anand Deverakonda Highway Movie Shooting,Highway,Highway Movie,Highway Telugu Movie,Anand Deverakonda New Movie Highway Shooting,Anand Deverakonda Highway Movie Shooting Started,Anand Deverakonda And KV Guhan Movie,Anand Deverakonda’s Highway,Highway Movie Shooting,Highway Movie Updates,Anand Deverakonda Starts Highway Movie Shooting,Highway Shoot Begins,Manasa Radhakrishnan,Anand Deverakonda Manasa Radhakrishnan Movie,Anand Deverakonda Highway Begins Shoot,Highway Shoot Begins,Anand Deverakonda And Manasa Radhakrishnan Highway Filming Started,Anand Devarakonda Highway Movie Shoot Begins,Highway Movie Shoot Begins,#Highway

విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా దొరసాని తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మిడిల్క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక మొదటి నుండి కాస్త డిఫరెంట్ సినిమాలు ఎంపిక చేసుకునే ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌ జంటగా కేవీ గుహన్‌ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ‘హైవే’ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నేటి నుండి ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. తొలిచిత్రం ‘చుట్టాలబ్బాయి’ ఘనవిజయంతో ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న వెంకట్‌ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ‘హైవే’ చిత్రం నుండి కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్‌. ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌ కలిసి ఉన్న ఈ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ –‘‘గుహన్‌గారి దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ హీరోగా మా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బేనర్‌పై సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ మూవీగా ‘హైవే’ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మరికొంతమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో న‌టించ‌నున్నారు వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ‘హైవే’ తప్పకుండా ఒక సక్సెస్‌ఫుల్‌ థ్రిల్లింగ్‌ మూవీ అవుతుంద‌ని న‌మ్మ‌కంఉంది’అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fourteen =