కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"మేజర్ "మూవీ విడుదల పై క్లారిటీ

Makers Of Major Movie Gives Update On Release Date,Adivi Sesh Given Clarity About Major Movie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adiv

"మేజర్ "మూవీ విడుదల పై క్లారిటీ

Makers Of Major Movie Gives Update On Release Date

Makers Of Major Movie Gives Update On Release Date,Adivi Sesh Given Clarity About Major Movie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adiv

సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

తెలుగు , హిందీ , మలయాళ భాషల “మేజర్ “మూవీ టీజర్ కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. మూడు భాషల టీజర్ యూట్యూబ్ లో 32 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తో అడివి శేష్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "మేజర్ "మూవీ రిలీజ్ డేట్ జూలై 2 గా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయి విడుదల వాయిదా పడింది “మేజర్ “మూవీ విడుదల తేదీ పై తాజాగా నటుడు అడివి శేష్ స్పందించారు. హిందీ లో థియేటర్లు మొదలైన తర్వాత ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ ను ఇస్తామని చెప్పారు. సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు “మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. సూపర్ హిట్ "HIT "మూవీ సీక్వెల్ "HIT 2 " మూవీ లో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్