చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా స్టార్ చిరంజీవి , విజయ్ దేవరకొండ , నిఖిల్ , విశ్వక్ సేన్ వంటి వారు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అనే యువనటుడు ఆకోవకు చెందుతారు. “రాజాగారు రాణివారు ” వంటి చిన్న సినిమాతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన కిరణ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిరణ్ హీరోగా రూపొందిన “ఎస్ఆర్ కళ్యాణ మండపం” మూవీ యూత్ లో మంచి క్రేజే తెచ్చుకుంది. ఈ చిత్రానికి కిరణ్ స్వయంగా కథ మాటలు స్క్రీన్ ప్లే అందించడం విశేషం. దీని టీజర్ ఇతర ప్రోమోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగష్టు 6వ తేదీ”ఎస్ఆర్ కళ్యాణ మండపం” మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పోలీస్ స్టోరీ “సెబాస్టియన్” మూవీ లో హీరోగా నటిస్తున్న కిరణ్ మరో మూవీ “సమ్మతమే”లో కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా కోడి రామకృష్ణ తనయ దివ్య దీప్తి నిర్మాణంలో కిరణ్ హీరోగా కొత్త దర్శకుడు కార్తీక్ శంకర్ రూపొందించనున్న మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: