మొత్తానికి టాలీవుడ్ లో తమిళ నటీనటులను బాగానే వాడుతున్నారు. ముఖ్యంగా సముద్రఖని లాంటి వారిని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు సముద్రఖని. ఇక ఇప్పుడు మరో సినిమాలో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరు సినిమాలో. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పనిలో పడ్డాడు. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సముద్రఖనిని ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏ పాత్రలో నటిస్తున్నాడన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు కానీ లూసీఫర్ రీమేక్ లో సముద్రఖని నటిస్తున్నాడన్న వార్త మాత్రం జోరుగా వినిపిస్తుంది. కాగా ఇప్పటికే పవన్‌కళ్యాణ్, రానా చేస్తున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్, మహేశ్ సర్కారువారి పాట చిత్రాల్లో నటిస్తున్నారు. మరి ఇందులో నటిస్తున్నాడో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు ప్రేక్షకుల నెటివిటీకి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేయనున్నారు. ఇక ఈసినిమా తరువాత మెహర్ రమేష్, బాబితో సినిమాలు చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: