
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 156


జపాన్ లో రష్మిక క్రేజ్

హనుమాన్ మరో మైల్ స్టోన్.. 150 థియేటర్లు-50రోజులు

హాలీవుడ్ లో చరణ్ క్రేజ్

ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేస్తుంది

తమన్నా ఓదెల2 షూటింగ్ మొదలు

హాలీవుడ్‌లో రీమేక్ అవుతోన్న దృశ్యం

గామి ట్రైలర్ పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రిలీజ్

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా

తమిళనాడులో సత్తా చాటుతున్న మలయాళ సినిమా

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు 18 మూవీ

ఆపరేషన్ వాలెంటైన్ కు షార్ట్ రన్ టైం

రాబిన్ హుడ్- ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ షూట్
వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. రాబిన్ హుడ్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

జపాన్ లో రష్మిక క్రేజ్
ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. పుష్ప సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఇక ఈ ఏడాది యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈనేపథ్యంలోనే తాజాగా రష్మిక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ 2024లో భారత్ తరపున పాల్గొనేందుకు రష్మికకు అవకకాశం దక్కింది. ఇక ఈ ఈవెంట్ కోసం జపాన్ వెళ్లింది రష్మిక. అయితే టోక్యో ఎయిర్ పోర్టులో రష్మిక ల్యాండ్ అవ్వగానే ఆమెకు గ్రాండ్ గా స్వాగతం లభించింది. జపాన్ లో రష్మిక…

హనుమాన్ మరో మైల్ స్టోన్.. 150 థియేటర్లు-50రోజులు
హనుమాన్ మూవీ మాత్రం తన జోరున ఎక్కడా తగ్గించేలా కనిపించట్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను దుల్లగొడుతుంది. నిజానికి రిలీజ్ కు ముందు ఈసినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అని అనుకోలేదు. కానీ రిలీజ్ తరువాత ఈసినిమా కొల్లగొడుతున్న రికార్డులు చూసి ఇప్పుడు అందరూ అశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి. ఇక ఈసినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది. ఈమేరకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మార్చి8వ తేదీన…

హాలీవుడ్ లో చరణ్ క్రేజ్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ కు హాలీవుడ్ లో కూడా క్రేజ్ బాగానే పెరిగిందన్న సంగతి తెలిసిందే. అక్కడ అవార్డులను సైతం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి చరణ్ క్రేజ్ అక్కడ ఎలా ఉంది రుజువైంది. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ప్రకటన ఇచ్చారు మేకర్స. ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ఒక పాత్ర కోసం నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఇక ఆ పాత్ర ఎలా ఉండాలో తెలియజేయడం కోసం కొన్ని పాత్రలను ఉదాహరణగా చూపించింది. అలా ఒక ఆరు పాత్రలని ఆ ప్రకటనలో ఇచ్చారు. ఆ పాత్రల్లో ఒకటి.. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ కాప్ రోల్. వాటిలో ఉన్న మిగిలిన ఐదు పాత్రలు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ గా నిలిచినవే. మరి అంతమంది హాలీవుడ్ నటుల మధ్య…

ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేస్తుంది
డైరెక్టర్ పరుశురాం ,సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్.పక్కా ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.సంక్రాంతికే ఈసినిమాను తీసుకురావాలనుకున్నారు కానీ కుదరలేదు.ఇక ఇప్పుడు షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు.అందులో భాగంగా ఈ సినిమా టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.ఈవిషయాన్ని విజయ్ అధికారికంగా ప్రకటించాడు.రేపు ఈ టీజర్ కు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం వుంది.

హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

గామి ఆడియెన్స్‌లో ఆ ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేస్తుంది - డైరెక్టర్ విద్యాధర్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. అభినయ, హారిక, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గామి' చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షోరీల్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

తమన్నా ఓదెల2 షూటింగ్ మొదలు
అశోక్ తేజ దర్శకత్వంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల రైల్వేస్టేషన్ అనే థ్రిల్లర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించాడు. 2022 లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ ను తాజాగా ఇచ్చారు మేకర్స్. ఈసినిమాకు ఓదెల2 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

హాలీవుడ్‌లో రీమేక్ అవుతోన్న దృశ్యం
భారతీయ సినిమాలకు ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. దేశీయ మూలాల నేపథ్యంతో రూపొందిన కథలు విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. మేకర్స్ సైతం కొత్త తరహా కథలతో మూవీలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ప్రఖ్యాత 'ఆస్కార్' పురస్కారాన్ని సైతం అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక భారతీయ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘దృశ్యం’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ -ఆపరేషన్ సక్సెస్
ఓవరాల్ గా ఆపరేషన్ వాలైంటైన్ ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది.వరుణ్ తేజ్ నటన ,విజువల్స్ ,ప్రీ క్లైమ్యాక్స్ ,క్లైమ్యాక్స్ ,డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి.వార్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ ఆపరేషన్ వాలెంటైన్ బాగా నచ్చుతుంది.

గామి ట్రైలర్ పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంత యాక్టీవ్ గా ఉండడు కానీ తనకు ఏదైనా సినిమా నచ్చితే మాత్రం వెంటనే ఆ సినిమా గురించి పోస్ట్ చేయడం చూస్తుంటాం. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంబంధించి ప్రభాస్ పోస్ట్ లు పెట్టగా.. తాజాగా మరో సినిమా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు. ఆసినిమా మరేదో కాదు విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గామి. విధ్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుంది. మార్చి 8వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సందీప్ రెడ్డి వంగా.. తెలుగోళ్ళు కాలర్ ఎత్తుకునేలా చేశాడు - విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గామి'. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు క్యూరియాసిటీ పెంచేశాయి. వచ్చే శుక్రవారం రోజు (మార్చి 8)న 'గామి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షోరీల్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

'గామి'.. థియేటర్స్‌లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది - సందీప్ రెడ్డి వంగా
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీతో విశ్వక్ సేన్ పక్కాగా హిట్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు క్యూరియాసిటీ పెంచేశాయి.

విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రిలీజ్
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

తమిళనాడులో సత్తా చాటుతున్న మలయాళ సినిమా
కోలీవుడ్ లో ప్రస్తుతం ఓ మలయాళ సినిమా డామినేషన్ కొనసాగుతుంది.గత వారం మంజిమ్మల్ బాయ్స్ అనే సినిమా విడుదలైయింది.చిన్న సినిమా గా వచ్చిన ఈసినిమా అదిరిపోయే టాక్ తో ఇప్పటివరకు 2కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈవారాంతం కల్లా మరో రెండు కోట్లను ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.దాంతో తమిళనాడులో బిగ్గెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 10కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు.పైగా అక్కడ ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా విడుదలకావడం లేదు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు 18 మూవీ
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

తెలుగులో బిజీ అవుతున్న బిగ్ బాస్ 17 ఫేమ్ అయేషా ఖాన్
బిగ్ బాస్ 17ఫేమ్ అయేషా ఖాన్ తెలుగులో బిజీ అవుతుంది.ముఖచిత్రం అనే సినిమాతో తెలుగులోకి రెండేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చినా ఈసినిమా తనకు కావాల్సిన గుర్తింపు ను తీసుకురాలేకపోయింది.దాంతో ఆఫర్లు లేక గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అయితే ఇటీవల బిగ్ బాస్ 17 పుణ్యమా అని ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి.అందులో భాగంగా శ్రీ విష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీమ్ బుష్ లో అయేషా ఓ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా మార్చి 22న విడుదలవుతుంది.హుషారు ఫేమ్ హర్ష కొనుగంటి ఈసినిమాను తెరకెక్కించగా యూవీ సెల్యులాయిడ్ నిర్మిస్తుంది.

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన దీపికా-రణ్‌వీర్ జంట
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలో వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. తాజాగా దీపిక పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ప్రెగ్నెంట్' అంటూ ఒక పోస్ట్ పెట్టారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అందులో వెల్లడించారు.

ఆపరేషన్ వాలెంటైన్ కు షార్ట్ రన్ టైం
మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రేపు రానుంది.ఈసినిమాకు బజ్ కూడా బాగానే వుంది.ఇండస్ట్రీ సర్కిల్ నుండి టాక్ కూడా పాజిటివ్ గానే వస్తుంది.ఇక ఈసినిమా చాలా తక్కువ రన్ టైం తో రానుంది.యు/ఏ సర్టిఫికెట్ తో కేవలం 2గంటల నిడివి తో థియేటర్లలోకి రానుంది.పుల్వామా ఘటనకు ఏవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే కథతో తెరకెక్కింది ఈసినిమా.మానుషీ చిల్లర్,రుహాణి శర్మ,నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా సోనీ పిక్చర్స్ నిర్మించింది.