ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ కు హాలీవుడ్ లో కూడా క్రేజ్ బాగానే పెరిగిందన్న సంగతి తెలిసిందే. అక్కడ అవార్డులను సైతం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి చరణ్ క్రేజ్ అక్కడ ఎలా ఉంది రుజువైంది. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ప్రకటన ఇచ్చారు మేకర్స. ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ఒక పాత్ర కోసం నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఇక ఆ పాత్ర ఎలా ఉండాలో తెలియజేయడం కోసం కొన్ని పాత్రలను ఉదాహరణగా చూపించింది. అలా ఒక ఆరు పాత్రలని ఆ ప్రకటనలో ఇచ్చారు. ఆ పాత్రల్లో ఒకటి.. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ కాప్ రోల్. వాటిలో ఉన్న మిగిలిన ఐదు పాత్రలు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ గా నిలిచినవే. మరి అంతమంది హాలీవుడ్ నటుల మధ్య రామ్ చరణ్ స్థానం దక్కించుకోవడం అంటే గొప్ప విషయమే అని చెప్పాలి. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: