సందీప్ రెడ్డి వంగా.. తెలుగోళ్ళు కాలర్ ఎత్తుకునేలా చేశాడు – విశ్వక్ సేన్

Vishwak Sen Praises Director Sandeep Reddy Vanga

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్, దయానంద్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు క్యూరియాసిటీ పెంచేశాయి. వచ్చే శుక్రవారం రోజు (మార్చి 8)న ‘గామి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షోరీల్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పిసిఎక్స్ ఫార్మాట్‌లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ఏడాది పూర్తి కాకముందే మరో సినిమాతో రావడం చాలా ఆనందంగా వుంది. గామి మొదలుపెట్టినప్పుడు సరిగ్గా నా పేరుకు మీకు తెలీదు. దర్శకుడు విద్యాధర్ విజన్ ని బలంగా నమ్మాము. అన్ని సినిమాలు వేరు ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరు. చిన్న టీంతో మొదలుపెట్టి ఈ రోజు ఇంత బిగ్ స్క్రీన్ లో ట్రైలర్ చూడటం చాలా ఆనందంగా వుంది” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇందులో మాస్ డైలాగులు, విజల్ కొట్టే ఫైట్స్, ఐటెం సాంగ్స్ వుండవు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫీలింగ్ సెకండ్ హాఫ్ లో వుంటుంది. ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. దర్శకుడు చాలా కష్టపడ్డాడు. వంశీ గారికి ధన్యవాదాలు. ఇండియన్ ఆడియన్స్ కి యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ సందీప్ అన్న.( నవ్వుతూ) తెలుగోళ్ళు కాలర్ ఎత్తుకునేలా చేసి డైరెక్టర్ తను. సందీప్ అన్న ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. కార్తిక్ అండ్ క్రౌడ్ నుంచి ఫండ్ చేసిన అందరికీ చాలా చాల థాంక్స్. మార్చి 8 థియేటర్స్ కి రండి కొత్తగా ర్యాంప్ అవుతుంది” అని విశ్వక్ సేన్ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 1 =