కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 155

Three major movies will be released this week
బాక్సాఫీస్

ఈవారం బాక్సాఫీస్ క్లాష్ మాములు గా లేదు

గత వారం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమాగా రిలీజ్ అయ్యింది మరి కొన్ని రీ రిలీజ్ లు కూడా అయ్యాయి.అయితే ఈవారం మాత్రం మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.ఈమూడు సినిమాలకు మంచి హైప్ వుంది.దాంతో పోటీ ఆసక్తికరంగా మారింది.ఇందులో రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు కాగా మరొకటి మలయాళ డబ్బింగ్ సినిమా.ఇంతకీ అవేంటంటే గోపిచంద్ భీమా,విశ్వక్ సేన్ గామి అలాగే ప్రేమలు అనే డబ్బింగ్ సినిమా ఈ శివరాత్రికి విడుదలకానున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Actress Samantha Ruth Prabhu Visited Tirumala and Tiruchanur Ammavaari Temples
సినిమా వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

టాలీవుడ్ ప్రముఖ నటి సమంత సోమవారం తిరుపతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ముందుగా తిరుమల కొండకు చేరుకొని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న సమంతకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సమంతకు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Srikanth Mవాట్సాప్
shivam full song out from gaami movie
సాంగ్

స్పిరిట్ ఆఫ్ గామి- శివమ్ ఫుల్ సాంగ్ రిలీజ్

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మార్చి 8వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

TFN Adminవాట్సాప్
Suriya Gives Special Party To Fans Who Worked For Relief Efforts in Tirunelveli
సినిమా వార్తలు

అభిమానులకు సూర్య స్పెషల్ విందు.. ఫొటోలు వైర‌ల్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో కూడా భారీగానే అభిమానులున్నారు. సినిమాలపరంగానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ఆయన కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా సూర్య తన అభిమానులకు ప్రత్యేక విందు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. గతేడాది సంభవించిన మిగ్‌జాం తుపాను కారణంగా తమిళనాడు అతలాకుతలమైన విషయం గుర్తుండే ఉంటుంది. భారీ వర్షాల కారణంగా చెన్నై సహా అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలుచోట్ల ఇళ్ళు మునిగిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Srikanth Mవాట్సాప్
talented actor rana joins in rajinikanths vettaiyan movie
సినిమా వార్తలు

తలైవా వెట్టైయాన్ సెట్ లో రానా

జైలర్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే పలు సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమాా టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెట్టైయాన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఖరారు చేశారు.

TFN Adminవాట్సాప్
Manjummel Boys gets a release date in Telugu
రిలీజ్ అప్‌డేట్

మరో మలయాళీ బ్లాక్ బాస్టర్ తెలుగులోకి

గత నెలలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి ప్రేమలు, భ్రమయుగం,మంజుమ్మెల్ బాయ్స్.ఇందులో భ్రమయుగంను తెలుగులో కూడా విడుదలచేశారు.రెస్పాన్స్ అయితే రాలేదు.ఇక మిగిలిన రెండు సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతున్నాయి.అందులో ప్రేమలు ఈ శివరాత్రికి విడుదలకానుంది.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల మార్క్ ను చేరుకుంది.చిన్న సినిమా గా వచ్చి ప్రేమలు సెన్సేషన్ సృష్టిస్తుంది.తెలుగులో ఈసినిమాను ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
geetha arts new movie title fixed as aay
సినిమా వార్తలు

గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న ఆయ్

టాలీవుడ్ లో ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్స్ట్ మొదటి వరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ బ్యానర్ పెద్ద సినిమాలను మాత్రమే కాదు చిన్న చిన్న సినిమాలు కూడా నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రూపొందించనున్నారు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్
bobby simha interesting update on salaar part 2 shoot
సినిమా వార్తలు

సలార్ 2 పై బాబి సింహా ఇంట్రస్టింగ్ అప్ డేట్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో వచ్చిన కథే ఈసినిమా. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు ఇన్నాళ్లూ సరైన సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి…

TFN Adminవాట్సాప్
Vishwak Sen Reveals Interesting Facts About Gaami Movie
సినిమా వార్తలు

కుంభమేళాలో నన్ను నిజంగా అఘోరా అనుకొని.. విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
allari naresh aa okkati adakku first single update
రిలీజ్ అప్‌డేట్

ఆ ఒక్కటీ అడక్కు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ ఒక్కటీ అడక్కు అనేే టైటిల్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఓ మేడం అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని మార్చి 4వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థమన్ చేతుల మీదుగా ఈపాటను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
premalu movie telugu trailer out now
ట్రైలర్ & టీజర్

ప్రేమలు తెలుగు ట్రైలర్ రిలీజ్

మలయాళం సినిమాలకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. కొన్ని సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో మలయాళం సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. గిరీష్ దర్శకత్వంలో రీసెంట్ గా మలయాళంలో వచ్చిన సినిమా ప్రేమలు. ఈసినిమా అక్కడ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈసినిమాను తెలుగులో రిలీజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
actress varalaxmi sarathkumar gets engaged
సినిమా వార్తలు

నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్

తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ తరువాత వరుసగా సినిమాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోయింది. హనుమాన్ తో ఈ ఏడాది వరలక్ష్మి మరో సక్సెస్ ను అందుకున్నారు.

TFN Adminవాట్సాప్
rajendra prasad join in kalki 2898 ad movie
సినిమా వార్తలు

కల్కి 2898 ఏడీ లో నటకిరీటీ

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Spirit Shoot Starts From this year End
సినిమా వార్తలు

ప్రభాస్ స్పిరిట్ స్టార్ట్ ఎప్పుడంటే

అర్జున్ రెడ్డి తరువాత గత ఏడాది యానిమల్ తో సెన్సేషన్ సృష్టించాడు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.ఈసినిమా ఏకంగా 700కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.ఇక ఈసినిమా తరువాత సందీప్ ,రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాచేయనున్నాడు దాంతో ఈసినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
HanuMan 50 Days Celebrations Producer Niranjan Reddy Praises Director Prasanth Varma
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరిన్ని చిత్రాలు - నిర్మాత నిరంజన్ రెడ్డి

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్ సాధించి, సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులని పూర్తి చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
teja sajja emotional post on hanuman movie
సినిమా వార్తలు

హనుమాన్ పై తేజ ఎమోషనల్ పోస్ట్

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంటాయి. అలాంటి సినిమానే రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో విజువల్ వండర్ గా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగింది. రిలీజ్ అయిన మొదటి షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో కూడా ఈసినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. దీంతో కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

TFN Adminవాట్సాప్
Eagle is trending on Prime Video
ఓటీటీ

ఓటిటిల్లో కూడా ఈగల్ కు సూపర్ రెస్పాన్స్

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ గత నెల 9న విడుదలై మంచి మౌత్ టాక్ తో 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా నిన్న ఓటిటిల్లో విడుదలైయింది.అమెజాన్ ప్రైమ్ తో పాటు ఈటీవీ విన్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకుకొచ్చాయి. ఈసినిమాను ఓటిటిల్లో చూసిన వారిదగ్గరనుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.అంతేకాదు అమెజాన్ ప్రైమ్ లో సాలిడ్ వ్యూస్ తో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Mahender Reddyవాట్సాప్
jai hanuman first look poster come soon
ఫస్ట్ లుక్

జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది

ఈసంక్రాంతి కి చిన్న సినిమాగా వచ్చి చరిత్ర సృష్టించింది హనుమాన్.స్టార్ హీరోల పేరిట వున్న రికార్డులు బద్దలు కొట్టి సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా రికార్డు ను కూడా ఖాతాలో వేసుకుంది అంతేకాదు ఆర్ ఆర్ ఆర్,బాహుబలి 1&2 తరువాత అత్యధిక లాభాలను తెచ్చిన సినిమాగా రికార్డు క్రీయేట్ చేసింది.ఏకంగా 100కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది ఈసినిమా.ప్రపంచ వ్యాప్తంగా 300కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్నటితో ఈసినిమా 50రోజులను పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Tollywood Star Heroes Jr. NTR and Ram Charan Seen Together at Begumpet Airport
సినిమా వార్తలు

ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్.. నెట్టింట వీడియో వైర‌ల్

టాలీవుడ్ స్టార్ హీరోలు, 'ఆర్ఆర్ఆర్' కో స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్‌లు ఒకేచోట కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీరు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో కలిసి కనిపించారు. వీరిద్ద‌రూ క‌లిసి ఎయిర్ పోర్ట్‌లో కలుసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో పాల్గొనేందుకై బేగంపేట విమానాశ్రయం వద్దకు వచ్చారు. గుజరాత్ లోని జామ్ న‌గ‌ర్‌లో అనంత్ అంబానీ వివాహం జరుగనున్న సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
the kerala story movie creates sensation on ott too
ఓటీటీ

ఓటీటీలో కూడా ది కేరళ స్టోరీ సంచలనం

కొన్నిసినిమాలు రిలీజ్ కు ముందు వివాదాలు సష్టిస్తాయి. రిలీజ్ తరువాత కూడా వివాదాలు సృష్టిస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది ది కేరళ స్టోరీ సినిమా. సుదీప్తో సేన్ దర్శకత్వంలో యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమా వచ్చింది. ముగ్గురు కేరళ యువతులు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాదం వైపు ఎలా వెళ్లారు అనే కథాశంతో తెరకెక్కింది. ఇక గత ఏడాది రిలీజ్ అయిన ఈసినిమా సంచలన విజయం సాధించింది.

TFN Adminవాట్సాప్

షేర్