ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేస్తుంది 

family star teaser coming soon

డైరెక్టర్ పరుశురాం ,సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్.పక్కా ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.సంక్రాంతికే ఈసినిమాను తీసుకురావాలనుకున్నారు కానీ కుదరలేదు.ఇక ఇప్పుడు షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు.అందులో భాగంగా ఈ సినిమా టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.ఈవిషయాన్ని విజయ్ అధికారికంగా ప్రకటించాడు.రేపు ఈ టీజర్ కు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే నెల 5న ఈసినిమా తెలుగు తోపాటు తమిళంలో కూడా విడుదలకానుంది.నిజానికి దేవర అదే డేట్ కు రావాల్సివుంది కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో దసరాకు వెళ్ళిపోయింది.దాంతో ఫ్యామిలీ స్టార్ ఆ డేట్ ను లాక్ చేసుకుంది.ఇక విజయ్ దేవరకొండ ఈసినిమాతోపాటు తన 12వ సినిమాలో కూడా నటిస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఈఏడాది చివర్లో విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.