బిగ్ బాస్ 17ఫేమ్ అయేషా ఖాన్ తెలుగులో బిజీ అవుతుంది.ముఖచిత్రం అనే సినిమాతో తెలుగులోకి రెండేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చినా ఈసినిమా తనకు కావాల్సిన గుర్తింపు ను తీసుకురాలేకపోయింది.దాంతో ఆఫర్లు లేక గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అయితే ఇటీవల బిగ్ బాస్ 17 పుణ్యమా అని ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి.అందులో భాగంగా శ్రీ విష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీమ్ బుష్ లో అయేషా ఓ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా మార్చి 22న విడుదలవుతుంది.హుషారు ఫేమ్ హర్ష కొనుగంటి ఈసినిమాను తెరకెక్కించగా యూవీ సెల్యులాయిడ్ నిర్మిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా కాకుండా రీసెంట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో అయేషా స్పెషల్ సాంగ్ ఒకటి చేసింది.ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా కాగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో కృష్ణ చైతన్య ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.నిజానికి ఎప్పుడో విడుదలకావాల్సి ఈసినిమా పెండింగ్ వర్క్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది.ఏప్రిల్ లో ఈసినిమా విడుదలయ్యే ఛాన్స్ వుంది.
ఇక రీసెంట్ గా మరో ఆఫర్ ను కొట్టేసింది అయేషా ఖాన్.మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో సీతారామం తో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు ఈహీరో తెలుగులో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు.అదే లక్కీ భాస్కర్.ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా అయేషా ఖాన్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారట.ఈసినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో అయేషా చెప్పుకొచ్చింది.వెంకీ అట్లూరి ఈసినిమా డైరెక్ట్ చేస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ -సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: