ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. పుష్ప సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఇక ఈ ఏడాది యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈనేపథ్యంలోనే తాజాగా రష్మిక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ 2024లో భారత్ తరపున పాల్గొనేందుకు రష్మికకు అవకకాశం దక్కింది. ఇక ఈ ఈవెంట్ కోసం జపాన్ వెళ్లింది రష్మిక. అయితే టోక్యో ఎయిర్ పోర్టులో రష్మిక ల్యాండ్ అవ్వగానే ఆమెకు గ్రాండ్ గా స్వాగతం లభించింది. జపాన్ లో రష్మిక అభిమానులు….ఆమె ఫొటోస్‌తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ సాదరంగా ఆహ్వానించారు. ఇక జపాన్ అభిమానులు తనకు చూపించిన అభిమానానికి సంతోషం వ్యక్తం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప2 సినిమాతో బిజీగా ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా యానిమల్ 2 లైన్ లో ఉంది. వీటితో పాటు ఒక లేడీ ఒరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తుంది. చిలసౌ సినిమా దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: