బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలో వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. తాజాగా దీపిక పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రెగ్నెంట్’ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అందులో వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం దీపిక పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక విషయం తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ స్టార్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇటీవల లండన్‌లో జరిగిన 77వ బాఫ్టా వేడుకలో రెడ్ కార్పెట్‌పై దీపిక పదుకొణె మెరిసింది. అయితే తొలుత చీరకట్టులో తళుక్కుమన్న ఆమె ఆ తర్వాత కంఫర్ట్ ఔట్ఫిట్ వేసుకుని కనిపించింది. ఈ సందర్భంగా దీపికను చూసిన నెటిజన్స్ ఆమె బేబీ బంప్‌తో ఉందని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
ఈ నేపథ్యంలో వీరి వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా దీపిక పదుకొణె తాను త్వరలోనే తల్లి కాబోతున్నానంటూ స్వయంగా ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. కాగా దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆరేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట అదే ఏడాది నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























