పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు ప్రభాస్ సందీప్ వంగా తో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఈసినిమా ఓ జోనర్ లో ఉండబోతుందా అన్న క్యూరియాసిటీ అందరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు సందీప్. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ వంగాను స్పిరిట్ హర్రర్, లేదా సూపర్ నాచురల్ మూవీనా, అందుకే అటువంటి టైటిల్ పెట్టారా అని అడగగా దానికి సందీప్.. స్పిరిట్ మూవీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ తప్ప అది ఏమాత్రం హర్రర్ లేదా సూపర్ నాచురల్ స్టోరీ కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నానని తెలిపాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: