హనుమాన్ మూవీ మాత్రం తన జోరున ఎక్కడా తగ్గించేలా కనిపించట్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను దుల్లగొడుతుంది. నిజానికి రిలీజ్ కు ముందు ఈసినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అని అనుకోలేదు. కానీ రిలీజ్ తరువాత ఈసినిమా కొల్లగొడుతున్న రికార్డులు చూసి ఇప్పుడు అందరూ అశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి. ఇక ఈసినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది. ఈమేరకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మార్చి8వ తేదీన ఈసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పటివరకూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈసినిమా ఇప్పుడు మరో మైల్ స్టోన్ ను సొంతం చేసుకుంది. ఈమధ్య సినిమాలు థియేటర్లలో రెండు మూడు వారాలు ఆడటమే గగనం అయిపోతున్న నేపథ్యంలో ఈసినిమా మాత్రం ఏకంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా 150 సెంటర్లలో 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. మరి ఇది మాములు విషయం కాదు. దీంత ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
The Legendary Run of #HANUMAN hits a huge Milestone at Theaters 💥❤️🔥
This All-time Sankranthi Blockbuster completes 5️⃣0️⃣ DAYS in 150 Centers with Unanimous Love & Reception from the Audience 😍🔥
A @PrasanthVarma film
🌟ing @tejasajja123… pic.twitter.com/BVoAlmn2b6— Primeshow Entertainment (@Primeshowtweets) March 1, 2024
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: