
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 157


నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా సారీ

స్వాగ్ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

ఫుల్ స్వింగ్ లో కన్నప్ప సెకండ్ షెడ్యూల్

హైద్రాబాద్ లో ఫుల్ స్వింగ్ లో దేవర షూట్

గీతాంజలి మళ్లీ వచ్చింది రిలీజ్ డేట్ వాయిదా

ఆశిష్-వైష్ణవి చైతన్య మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

నెట్ ఫ్లిక్స్ చేతికి విజయ్ ది గోట్
లియోతో గత ఏడాది కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దళపతి విజయ్ ప్రస్తుతం తన 68వ సినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)లో నటిస్తున్నాడు.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.

నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా సారీ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడిన మాటలు దుమారం రేపిన సంగతి తెలిసిందే కదా. దానిపై ఇప్పటికే వరుణ్ సైతం క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా ఇంకా కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా నాగబాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సారీ చెప్పారు. ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను…

ఆపరేషన్ వాలెంటైన్ నుండి ప్రభవించే సాంగ్ రిలీజ్
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభవించే అంటూ వచ్చే నాలుగో పాటను రిలీజ్ చేశారు.

శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాజమౌళి దంపతులు
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలతో ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గత చిత్రం 'ఆర్ ఆర్ఆర్' అయితే అమెరికా, జపాన్ సహా అనేక దేశాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే పట్టాలెక్కనుంది.

స్వాగ్ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇక గత ఏడాది సామజవరగమన అనే సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఈగల్ అమెజాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోటీ నుండి తప్పుకొని సింగిల్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకొని ఫైనల్ గా ఫిబ్రవరి9వ తేదీన రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రవితేజ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది.

వెబ్‌సిరీస్‌గా మాజీ ప్రధాని పీవీ జీవిత చరిత్ర
భారత మాజీ ప్రధాన మంత్రి, దివంగత పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రధానిగా ఉన్న 1991 నుంచి 1996 మధ్య కాలంలో సరికొత్త ఆర్థిక సంస్కరణలను ఎంతో సాహసోపేతంగా అమలుచేసి దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించిన వైనం అనన్యసామాన్యం. కాలక్రమంలో ఆ సంస్కరణల ఫలాలు దేశ స్థితిగతులనే మార్చేశాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా బలమైన ఆర్ధిక శక్తిగా భారత్ ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. కాగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పీవీ తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం.

ప్రముఖ సంస్థలకు సిద్దూ జాక్ నార్త్ అమెరికా హక్కులు
గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కూడా సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి…

50కోట్ల క్లబ్ లో చేరనున్న ఆర్టికల్ 370
ఆర్టికల్ 370 హిందీలో అదరగొడుతుంది.వీక్ డేస్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగింస్తూ 50కోట్లలో చేరడానికి రెడీ గా వుంది.దేశ వ్యాప్తంగా సోమవారం 3.60కోట్లు,మంగళవారం 3.55కోట్లు రాబట్టింది.దాంతో 5రోజుల్లో 32.60కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 44.60కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 50కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో కూడా చేరే ఛాన్స్ వుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ కూడా జోరుగా ప్రమోషన్స్ ను చేస్తుంది. ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైపోయింది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు. సెన్సార్ సభ్యల నుండి ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు…

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీవిష్ణు హర్ష కనుగొంటి దర్శకత్వంలో ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
గత వారం అన్ని చిన్న సినిమాలే విడుదలకాగా ఇందులో ఏఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చేయలేకపోయింది.ఇక ఈవారం ఓ మీడియం బడ్జెట్ మూవీ విడుదలవుతుంది అదే ఆపరేషన్ వాలంటైన్.ఈసినిమాకు హైప్ కూడా బాగానే వుంది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈసినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇక ఈసినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

రామ్ గోపాల్ వర్మ కీలక ప్రకటన.. వ్యూహం రిలీజ్ ఆ రోజే
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లేటెస్ట్ పొలిటికల్ ఎంటర్‌టైనర్స్ ‘వ్యూహం’, ‘శపథం’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఫిబ్రవరి 23న, ‘వ్యూహం’.. అలాగే మార్చి 1న ‘శపథం’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ రెండు సినిమాల విడుదల నిలిచిపోయింది.

ఫుల్ స్వింగ్ లో కన్నప్ప సెకండ్ షెడ్యూల్
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

ఆపరేషన్ వాలెంటైన్.. టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే? - వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించగా.. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని…

రజినీకాంత్‌తో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కొత్త సినిమా
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. తాజాగా తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' చిత్రంతో ప్రేక్షకులను పలుకరించారు. తన 48 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ కలిగిన ఆయన ఈ వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో 'వేట్టైయన్' (#తలైవర్170) అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న '#తలైవర్171' మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.

హైద్రాబాద్ లో ఫుల్ స్వింగ్ లో దేవర షూట్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈగ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తేనే అర్థమవుతుంది ఈసినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో..

గీతాంజలి మళ్లీ వచ్చింది రిలీజ్ డేట్ వాయిదా
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

వరుణ్ తేజ్‌లో యంగ్ మెగాస్టార్‌ను చూశాను - శక్తి ప్రతాప్ సింగ్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించగా, మానుషీ చిల్లార్ కథానాయికగా నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు…

ఆశిష్-వైష్ణవి చైతన్య మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్ ను చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.