మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రేపు రానుంది.ఈసినిమాకు బజ్ కూడా బాగానే వుంది.ఇండస్ట్రీ సర్కిల్ నుండి టాక్ కూడా పాజిటివ్ గానే వస్తుంది.ఇక ఈసినిమా చాలా తక్కువ రన్ టైం తో రానుంది.యు/ఏ సర్టిఫికెట్ తో కేవలం 2గంటల నిడివి తో థియేటర్లలోకి రానుంది.పుల్వామా ఘటనకు ఏవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే కథతో తెరకెక్కింది ఈసినిమా.మానుషీ చిల్లర్,రుహాణి శర్మ,నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా సోనీ పిక్చర్స్ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా పై వరుణ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు ఇంతకుముందు తను చేసిన ప్రయోగాత్మక సినిమాలు అంతగా వర్క్ అవుట్ కాలేదు కానీ ఈసారి ఆపరేషన్ వాలెంటైన్ సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశాడు.
ఇక ట్రైలర్ లో విజువల్స్ చూస్తే చాలా క్వాలిటీ గా వున్నాయి.అయితే కేవలం 40కోట్ల బడ్జెట్ లోనే అంత క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చారట.అటు ఈసినిమా బిజినెస్ పరంగా కూడా బాగానే చేసింది.మరి ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























