మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీతో విశ్వక్ సేన్ పక్కాగా హిట్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు క్యూరియాసిటీ పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వచ్చే శుక్రవారం రోజు (మార్చి 8)న ‘గామి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షోరీల్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ‘గామి’ సినిమా యొక్క గ్రాండ్ స్కేల్ మరియు గ్రాండియర్‌ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్‌ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్లో తొలిసారిగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా బావుంది. చాలా అరుదైన సినిమా ఇది. ఆరేళ్ళు పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా ప్యాషన్ వుంటేనే ఇది సాధ్యమౌతుంది. మేకప్ అందుబాటులో లేనప్పుడు విశ్వక్ స్వయంగా మేకప్ చేసుకున్న సందర్భాలు వున్నాయి. సౌండ్ డిజైన్ కలర్ గ్రేడింగ్ చాలా టెర్రిఫిక్ గా వున్నాయి. థియేటర్స్ లో చూసేటప్పుడు మంచి ఎక్స్ పీరియన్స్ వస్తుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. కథని చాలా డిఫరెంట్ గా చెప్పారు. టీం అందరికీ గుడ్ లక్. మార్చి 8న తప్పకుండా చూడండి” అని కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























