వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. రాబిన్ హుడ్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా రోజుల తరువాత తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చింది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతుందని.. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆద్వర్యంలో అల్యూమినియం ఫ్యాక్టరిలో టెర్రిఫిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ ను షూట్ చేస్తున్నారని తెలిపారు. ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకే ఒక హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
The shooting of #Robinhood is happening at a rapid pace in Hyderabad
A Terrific Interval Action Block is being shot on @Actor_nithiin currently under the supervision of #RamLakshman Masters in Aluminium Factory
This is said to be one of the Major Highlights of the film… pic.twitter.com/8cqianpLcw
— Vamsi Kaka (@vamsikaka) March 1, 2024
కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: