గామి ఆడియెన్స్‌లో ఆ ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేస్తుంది – డైరెక్టర్ విద్యాధర్

Director Vidyadhar Reveals Interesting Facts About Gaami Movie

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. అభినయ, హారిక, మహ్మద్ సమద్, దయానంద్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గామి’ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షోరీల్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ వేడుకకు మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా విచ్చేశారు. పిసిఎక్స్ ఫార్మాట్‌లో రూపొందించిన మూవీ ట్రైలర్‌ను ఆయన లాంచ్ చేశారు. దర్శకుడు విద్యాధర్ కాగిత మాట్లాడుతూ.. చిన్నగా మొదలై పెద్ద సినిమా అయ్యింది గామి. వంశీ గారు మమ్మల్ని బలంగా నమ్మారు. చాలా ఫ్రీడం ఇచ్చారు. సందీప్ అన్న చాలా హెల్ప్ చేశారు. గామి సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ అవుతుంది. దాని కోసమే ఇన్నేళ్ళు కష్టపడ్డాం. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మార్చి 8న కొత్తరం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటునన్నాను” అన్నారు

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన చాందిని చౌదరి మాట్లాడుతూ.. ట్రైలర్‌కు మించి సినిమా వుంటుంది. ప్రతి విభాగం చాలా శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మార్చి 8న తప్పకుండా అందరూ చూడాలి” అని కోరారు.  కాగా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ గామి షోరీల్ ట్రైలర్‌ లాంఛింగ్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =