ఈవారం బాక్సాఫీస్ క్లాష్ మాములు గా లేదు 

Three major movies will be released this week

గత వారం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమాగా రిలీజ్ అయ్యింది మరి కొన్ని రీ రిలీజ్ లు కూడా అయ్యాయి.అయితే ఈవారం మాత్రం మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.ఈమూడు సినిమాలకు మంచి హైప్ వుంది.దాంతో పోటీ ఆసక్తికరంగా మారింది.ఇందులో రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు కాగా మరొకటి మలయాళ డబ్బింగ్ సినిమా.ఇంతకీ అవేంటంటే గోపిచంద్ భీమా,విశ్వక్ సేన్ గామి అలాగే ప్రేమలు అనే డబ్బింగ్ సినిమా ఈ శివరాత్రికి విడుదలకానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపిచంద్ నటించిన భీమా ప్రమోషనల్ కంటెంట్ తో సూపర్ హైప్ తెచ్చుకుంది.గోపిచంద్ చివరి మూడు సినిమాలు అంతగా ఆడకపోయినా ఆ ప్రభావం భీమా పై పెద్ద గా పడలేదు.ఈసినిమా సాలిడ్ ప్రీ రిలీజ్ చేసింది. భీమాలో గోపిచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.లుక్ కూడా  బాగుంది.యాక్షన్ సీన్స్ సినిమా లో హైలైట్ అవ్వనున్నాయట.ఈసినిమా విజయం గోపిచంద్ కు తప్పినసరి కానుంది.గోపిచంద్ కూడా సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు దాంతో సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నాడు.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు భీమా వండర్స్ చేయడం ఖాయం.

గామి విషయానికి వస్తే విశ్వక్ సేన్ నటించిన ఈసినిమా ఎన్నో సంవత్సరాలు ప్రొడక్షన్ లో ఉండి ఎట్టకేలకు ఇప్పుడు విడుదలవుతుంది.రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ ను విడుదల చేయగా స్టన్నింగ్ రెస్పాన్స్ వచ్చింది దాంతో గామిపై అంచనాలు పెరిగిపోయాయి.ముఖ్యంగా విజువల్స్ అదిరిపోయాయి.చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేశాడు.ఈసినిమాను విశ్వక్ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు.

ఇక భీమా,గామిలతోపోటీ పడుతుంది రీసెంట్ మాలీవుడ్ సెన్సేషన్ ప్రేమలు.ఈసినిమా దాదాపు 90కోట్ల వసూళ్లను రాబట్టింది.అక్కడ ఈసినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ తెలుగులో విడుదలచేస్తున్నాడు.హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ కావడంతో ఇక్కడ వారికి కూడా బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.మమితా బైజు ,నస్లేన్ , శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా గిరీష్ ఏడి డైరెక్ట్ చేశాడు.మరి ఈ మూడు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 6 =