టాలీవుడ్ లో ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్స్ట్ మొదటి వరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ బ్యానర్ పెద్ద సినిమాలను మాత్రమే కాదు చిన్న చిన్న సినిమాలు కూడా నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రూపొందించనున్నారు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఈసినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ఆయ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఆయ్ అంటే గోదావరి పదం అన్న సంగతి తెలిసందే కదా. దీంతో ఈ టైటిల్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఫస్ట్ లుక్ అప్ డేట్ ను కూడా ఇచ్చారు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు.
అందరికీ హాయ్! కాదు కాదు “ఆయ్” అండి!😊
Watch How a Hilarious Call Between the Team Unveils the Pure Godavari Title #AAY 🔥🤩
▶️ https://t.co/5Dy52ibHEZ#AAYMovie First Look on March 7th❤️#SummerLoKummedham#BunnyVas #VidyaKoppineedi @NarneNithiin @UrsNayan @GA2Official… pic.twitter.com/kvj9wYBuZw
— Geetha Arts (@GeethaArts) March 4, 2024
కాగా ఈసినిమానుఅల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్లు త్వరలో ఇవ్వనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: