
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 154


దేవర- తంగం కు టీమ్ బర్త్ డే విషెస్

అఫీషియల్.. రామ్ చరణ్ RC16 లో జాన్వీ కపూర్

శర్వా 35 టైటిల్ రిలీజ్

మట్కా విషయంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

భీమాను అఖండతో పోలుస్తున్నారు.. కానీ - గోపీచంద్

వార్ 2 స్టార్ట్ అయ్యేది అప్పుడే

శర్వా 35 అప్డేట్ వచ్చేసింది

బచ్చల మల్లి షూటింగ్ కీలక అప్డేట్

ఫ్యామిలీ స్టార్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న గామి

బలగం 1 ఇయర్ సెలబ్రేషన్స్

కన్నప్ప కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్

ట్రెండింగ్ లో సలార్ హిందీ వెర్షన్

'గామి' కథ, పెర్ఫామెన్స్, విజువల్స్ కొత్త అనుభూతిని ఇస్తాయి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విద్యాధర్ కాగిత విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నారు.

దేవర- తంగం కు టీమ్ బర్త్ డే విషెస్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్ 5న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ తరువాత రిలీజ్ డేట్ ను మార్చారు. అక్టోబర్ 10 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా ముగించుకుంటుంది.

గీతాంజలి మళ్లీ వచ్చింది నుండి రెంట్ కి డబ్బు లేదు సాంగ్ రిలీజ్
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.నిజానికి ఈసినిమాను మార్చి 22వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సివచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

అఫీషియల్.. రామ్ చరణ్ RC16 లో జాన్వీ కపూర్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్న ఆయన, దీని తరువాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ భాగం కానుంది.

శర్వా 35 టైటిల్ రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ నుండి సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. తన నుండి 2022 ఒకే ఒక జీవితం సినిమా వచ్చింది. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇక ఆతరువాత నుండి ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన నుండి ఒక సినిమా వస్తుంది. శర్వా 35 అనే టైటిల్ తోనే ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకుంది.

ఆ ఒక్కటీ అడక్కు నుండి ఓ మేడమ్ అనే పాట రిలీజ్
అల్లరి నరేష్ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది పలు సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఈ ఏడాది అప్పుడే మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేసేశాడు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది.

మట్కా విషయంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. వరుణ్ మార్కెట్ కన్నా సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందని అందుకే ఆగిపోయిదంటూ ప్రచారం జరిగింది.అయితే ఈవిషయం లో నిర్మాతలు తాజాగా క్లారిటీ ఇచ్చారు.ఈసినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు.ఈరోజు ఆమె బర్త్ డే సందర్బంగా మట్కా నుండి పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు దాంతో సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తలకు చెక్ పెట్టినట్లైయింది.

భీమాను అఖండతో పోలుస్తున్నారు.. కానీ - గోపీచంద్
మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ లావిష్‌గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

వార్ 2 స్టార్ట్ అయ్యేది అప్పుడే
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించనున్న చిత్రం వార్ 2.ఈసినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇందులో ఎన్టీఆర్ ఇండియన్ ఏజెంట్ గా కనిపించనున్నాడు.బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయనున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.ఈనెల 7నుండి జపాన్ లోని ఓ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో హృతిక్ ఇంట్రో సీన్లను చిత్రీకరించనున్నారు.ఏప్రిల్ నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది.

లక్కీ భాస్కర్ నుండి మీనాక్షి ఫస్ట్ లుక్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

శర్వా 35 అప్డేట్ వచ్చేసింది
ఒకే ఒక జీవితంతో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో శర్వానంద్.ఈ హీరో త్వరలోనే తన 35వ సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తుండగా శర్వా సరసన కృతి శెట్టి నటిస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చేసింది.అదేంటంటే ఈసినిమా మోషన్ పోస్టర్ ను రేపు విడుదలచేయనున్నారు.అందులో టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నారు.మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

బచ్చల మల్లి షూటింగ్ కీలక అప్‌డేట్
అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'బచ్చల మల్లి'. హీరోగా ఆయనకిది 63వ సినిమా కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తుండగా.. ‘సామజవరగమన’ ఫేమ్ రాజేష్ దండా, బాలాజీ గుత్తాలు హాస్య మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. 'బచ్చల మల్లి' చిత్రం కీలక షెడ్యూల్‌ను ముగించుకుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా ఎలా రూపుదిద్దుకుంటుందనే దానిపై చిత్రబృందం ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఫ్యామిలీ స్టార్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్
గీత గోవిందం తరువాత డైరెక్టర్ పరుశురాం,సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.ఇందులో విజయ్ మిడికల్ క్లాస్ కుర్రాడి గా కనిపించనున్నాడు.ఇక నిన్న ఈసినిమా టీజర్ ను వదిలారు.టీజర్ చూస్తే టైటిల్ కు తగ్గట్లే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.చివర్లో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ,విజయ్ దేవరకొండ మధ్య వచ్చే సన్నివేశం టీజర్ కు హైలైట్ అయ్యింది.ఓవరాల్ గా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్ లో ఈ టీజర్ ఇప్పటివరకు 7మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈసినిమా విజయ్ కి మరో గీత గోవిందం కానుంది.

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న గామి
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్,ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బలగం 1 ఇయర్ సెలబ్రేషన్స్
చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది బలగం. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మేకర్స్ కు పదింతలు లాభాలు చేకూర్చింది. ఇక ఈసినిమా అంతర్జాతీయంగా కూడా తన సత్తాను చాటింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఏడాదిని పూర్తిచేసుకుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ అంతా కలిసి వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు.

నా కెరీర్‌ను మలుపు తిప్పినవి ఆ మూడు సినిమాలే - మహేష్ బాబు
తన కెరీర్‌ను మలుపు తిప్పినవాటిలో మూడు సినిమాలు ఉన్నాయని, అవి తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన తన సినిమా కెరీర్, ఫ్యామిలీ విషయాలు, రాజమౌళితో చేయబోయే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సహా పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు తన తాజా చిత్రం గుంటూరు కారం మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.

కన్నప్ప కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్
చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం అయితే న్యూజిలాండ్ లోనే సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్
రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి తో డీసెంట్ హిట్ ను అందుకోగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది.

ట్రెండింగ్ లో సలార్ హిందీ వెర్షన్
రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ హిందీ వెర్షన్ కూడా ఓటిటి లో అదరగొడుతుంది.గత నెల 16న సలార్ హిందీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రాగ ఇప్పటికీ మొదటి స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక తెలుగు తోపాటు మిగితా వెర్షన్ లు నెట్ ఫ్లిక్స్ లో జనవరి లోనే విడుదలకాగా తెలుగు వెర్షన్ టాప్ 10 టెన్ ఇండియన్ మూవీస్ లో 10వస్థానంలో కొనసాగుతుంది.

గామి ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నారు.