మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ గత నెల 9న విడుదలై మంచి మౌత్ టాక్ తో 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా నిన్న ఓటిటిల్లో విడుదలైయింది.అమెజాన్ ప్రైమ్ తో పాటు ఈటీవీ విన్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకుకొచ్చాయి. ఈసినిమాను ఓటిటిల్లో చూసిన వారిదగ్గరనుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.అంతేకాదు అమెజాన్ ప్రైమ్ లో సాలిడ్ వ్యూస్ తో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ కెమెరా మెన్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో కనిపించింది.దేవ్ జాన్డ్ సంగీతం అందించాడు.సినిమాలో చివరి 40నిమిషాలు వచ్చే సన్నివేశాలు హైలైట్ అయ్యాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమాను నిర్మించింది.హిందీలో ఈసినిమా సహదేవ్ గా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది.
ఇక రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి ఈసినిమా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,టీ సిరీస్ నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలయ్యే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: