అర్జున్ రెడ్డి తరువాత గత ఏడాది యానిమల్ తో సెన్సేషన్ సృష్టించాడు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.ఈసినిమా ఏకంగా 700కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.ఇక ఈసినిమా తరువాత సందీప్ ,రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాచేయనున్నాడు దాంతో ఈసినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఎప్పుడు స్టార్ట్ కానుందో సందీప్ రెడ్డి చెప్పేశాడు.ఓఈవెంట్ లో సందీప్ మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని అన్నాడు.ఈసినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.టి సిరీస్ నిర్మించనుంది.
ఇదిలావుంటే ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో కల్కి 2898ఏడి ఒకటి. నాగ్ అశ్విన్ ఈసినిమా ను తెరకెక్కిస్తుండగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుంది.అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ఈసినిమాను నిర్మిస్తుంది.మే 9న విడుదలకానుంది.
ఈసినిమా తరువాత ప్రభాస్,రాజాసాబ్ ను పూర్తి చేయనున్నాడు.మారుతీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పుటి వరకు సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఈసినిమాను కంప్లీట్ చేసిన తరువాత ప్రభాస్,స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: