క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులని పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకలో చిత్ర బృందానికి హనుమాన్ ప్రతిమలను జ్ఞాపికలుగా అందించారు మేకర్స్. నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. “చాలా రోజుల తర్వాత 50 రోజుల పండగ హనుమాన్ సినిమాతో జరుపుకోవడం చాలా అనందంగా వుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి సినిమానే ఇంత పడ్డ విజయం సాధించడం సంతోషంగా వుంది. ఇది కేవలం ఒక శాతం మాత్రం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇంకా అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయి” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మా సినిమాని మీడియా చాలా సపోర్ట్ చేసింది. తేజ సజ్జా చాలా నమ్మకంతో అంకిత భావంతో సినిమా చేశారు. మా సినిమాలో పనిలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 50 రోజులు 150 థియేటర్స్‌లో ఆడటం అంటే మామూలు విషయం కాదు. మా డిస్ట్రిబ్యుటర్స్, ఎగ్జిబ్యుటర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రొడక్షన్ టీం అందరికీ స్పెషల్ థాంక్స్. చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా చేశాం. మా నుంచి రానున్న సినిమాలని కూడా ఇదే పాషన్‌తో చేస్తాం. ప్రేక్షకులు కూడా ఇదే ఆదరణ చూపాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: