కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో కూడా భారీగానే అభిమానులున్నారు. సినిమాలపరంగానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ఆయన కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా సూర్య తన అభిమానులకు ప్రత్యేక విందు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది సంభవించిన మిగ్జాం తుపాను కారణంగా తమిళనాడు అతలాకుతలమైన విషయం గుర్తుండే ఉంటుంది. భారీ వర్షాల కారణంగా చెన్నై సహా అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలుచోట్ల ఇళ్ళు మునిగిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సమయంలో హీరో సూర్య తన తమ్ముడు, మరో నటుడు కార్తీ వెంటనే స్పందించి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా.. వరద బాధితులకు అండగా ఉండాలని, అవసరమైన వారికి ఆర్ధిక సాయం అందేలా చూడాలని తమ అభిమాన సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సూర్య, కార్తీ ఫ్యాన్స్ రంగంలోకి దిగి వేలాదిమందికి సహాయం అందజేశారు. దీంతో అభిమానుల సేవలకు స్పందించిన సూర్య వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేసి, స్వయంగా వడ్డించారు. వీరితోపాటుగా గత రెండేళ్లలో వివాహం చేసుకున్న దాదాపు 50 మంది అభిమానులను కలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Actor @Suriya_offl met and appreciated his fans who worked in relief efforts in Tirunelveli and Tuticorin districts during the recent cyclone..
Also met and wished about 50 of his fans who got married in the last couple of years..
A sumptuous lunch was arranged for his fans..… pic.twitter.com/RCXzcVoZpA
— Ramesh Bala (@rameshlaus) March 3, 2024
ఇక ఇదిలావుండగా.. సూర్య ప్రస్తుతం సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా రూపొందుతోన్న ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్‌గా 10 భాషల్లో, 3డీ వర్షెన్‌లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: