మరో మలయాళీ బ్లాక్ బాస్టర్ తెలుగులోకి 

Manjummel Boys gets a release date in Telugu

గత నెలలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి ప్రేమలు, భ్రమయుగం,మంజుమ్మెల్ బాయ్స్.ఇందులో భ్రమయుగంను తెలుగులో కూడా విడుదలచేశారు.రెస్పాన్స్ అయితే రాలేదు.ఇక మిగిలిన రెండు సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతున్నాయి.అందులో ప్రేమలు ఈ శివరాత్రికి విడుదలకానుంది.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల మార్క్ ను చేరుకుంది.చిన్న సినిమా గా వచ్చి ప్రేమలు సెన్సేషన్ సృష్టిస్తుంది.తెలుగులో ఈసినిమాను ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరో సినిమా మంజిమ్మెల్ బాయ్స్ కూడా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టింస్తుంది.సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా ఒక్క కేరళ లోనే కాదు తమిళనాడులో కూడా సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటి వరకు అక్కడ 12కోట్ల వసూళ్లను రాబట్టింది.దాంతో ఆల్ టైం హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా చరిత్ర సృష్టించింది.అటు నార్త్ అమెరికా లో వన్ మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతుంది.వచ్చే వారంలో ఈమార్క్ ను చేరుకోనుంది.అంతేకాదు ఈఫీట్ సాధించిన మొదటి మలయాళ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించనుంది.

ఇన్ని రికార్డులు సృష్టించిన ఈసినిమా ఇప్పుడు తెలుగులోకి రానుంది.ది బాయ్స్ పేరుతో  మార్చి 15న  థియేటర్లోకి రానుంది.మరి చిన్న సినిమాలు గా వచ్చి రికార్డులు బ్రేక్ చేస్తున్న ప్రేమలు ,ది బాయ్స్ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.