నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్

actress varalaxmi sarathkumar gets engaged

తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ తరువాత వరుసగా సినిమాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోయింది. హనుమాన్ తో ఈ ఏడాది వరలక్ష్మి మరో సక్సెస్ ను అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇక ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పింది వరలక్ష్మీ శరత్ కుమార్. తన నిశ్చితార్థం నేడు జరిగింది. నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ నిశ్ఛితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో వివాహం జరగనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయగా అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.