కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంటాయి. అలాంటి సినిమానే రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో విజువల్ వండర్ గా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగింది. రిలీజ్ అయిన మొదటి షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో కూడా ఈసినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. దీంతో కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తాజాగా 50 రోజులు థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 థియేటర్లలో. మరి ఇది మాములు విషయం కాదు. దీంతో చిత్రయూనిట్ కూడా 50 రోజుల సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. ఈనేపథ్యంలో తేజ తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నా చిన్నప్పుడు ఇలా 50, 100 రోజుల వేడుకలు లాంటివి చూశాను మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అందులోనూ నా సినిమాకి చూడడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. అంతేకాదు చాలా మంది మా సినిమాని నమ్మలేదు, మేము ఈజీగా 4 వారాలు ఈసినిమా థియేటర్స్ లో రన్ అవుతుంది అని చెప్తే నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇది 8 వారాలు క్రాస్ చేసింది. ఎన్నో ఒడిదుడుకులు దాటి అందివచ్చిన ఈ సక్సెస్ ఒక మధుర జ్ఞ్యాపకంగా మిగిలిపోతుంది.. ఈవిజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
Thought it became a thing of the past to witness 50 days & 100 days celebrations but never imagined that we would recreate the moment today 🙌🏻
Only experienced the feeling when I worked as a child artist, glad to have one such moment of my own now 🙏🏻
Not everyone believed in…— Teja Sajja (@tejasajja123) March 2, 2024
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: