మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ ఒక్కటీ అడక్కు అనేే టైటిల్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఓ మేడం అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని మార్చి 4వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థమన్ చేతుల మీదుగా ఈపాటను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The soothing love melody calls for a REVERBERATING LAUNCH ❤️🔥❤️🔥
Sensational @MusicThaman will madathapetti in his style 😎 & launch the #OhMadam song on March 4th 🔥
Thank you for SPICING up our day 🕺
Promo – https://t.co/ga44K3VIaS#AaOkkatiAdakku #AOAonMarch22nd… pic.twitter.com/ROBJz5yEgh
— Chilaka Productions (@chilakaprod) March 2, 2024
కాగా ఈసినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష చెముడు, అరియానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: