మలయాళం సినిమాలకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. కొన్ని సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో మలయాళం సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. గిరీష్ దర్శకత్వంలో రీసెంట్ గా మలయాళంలో వచ్చిన సినిమా ప్రేమలు. ఈసినిమా అక్కడ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈసినిమాను తెలుగులో రిలీజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో ఈసినిమాను ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడు. మార్చి8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇక్కడ కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. కాగా ఈసినిమాలో మమితా బైజు,నస్లేన్,అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ నిర్మించగా విష్ణు విజయ్ సంగీతం అందించాడు.
And it’s here.. #Premalu ❤️❤️❤️https://t.co/zOl03V3Mqk https://t.co/FtpzOLypMf
— S S Karthikeya (@ssk1122) March 2, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























