టాలీవుడ్ స్టార్ హీరోలు, ‘ఆర్ఆర్ఆర్’ కో స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు ఒకేచోట కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీరు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో కలిసి కనిపించారు. వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్‌లో కలుసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకై బేగంపేట విమానాశ్రయం వద్దకు వచ్చారు. గుజరాత్ లోని జామ్ నగర్లో అనంత్ అంబానీ వివాహం జరుగనున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదే సమయంలో జూ. ఎన్టీఆర్.. ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంటిలో జరుగుతోన్న ఒక ప్రైవేట్ పార్టీకి హాజరయ్యేందుకు బెంగళూరు వెళ్ళడానికి బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఇలా వీరిద్దరూ ఒకే సమయానికి చేరుకోవడంతో ఒక్కసారిగా వీరిని చూసినవారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఇక ఇద్దరూ కలిసి ఒకే కారులో ఎయిర్‌పోర్ట్‌కి రావడం విశేషం. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేచోట కనిపించడంతో.. దీనిని చుట్టూ ఉన్నవారు తమ ఫోన్లలో, కెమెరాలలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి. ఇరువురు హీరోల అభిమానులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అయితే అంతకుముందు 12 మందితో కూడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపంతో దాదాపు 40 నిమిషాలపాటు గాలిలో చక్కర్లు కొట్టిన అనంతరం ఎటువంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ చేయబడింది. దీంతో ఈ IAF విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ మరియు ల్యాండింగ్లకు క్లియరెన్స్ లభించలేదు. ఈ క్రమంలో పలు ప్రైవేట్ విమానాలు ల్యాండింగ్‌లు ఆలస్యం అవడంతో.. బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు దాదాపు రెండు గంటల పాటు బేగంపేట విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: