సలార్ 2 పై బాబి సింహా ఇంట్రస్టింగ్ అప్ డేట్

bobby simha interesting update on salaar part 2 shoot

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో వచ్చిన కథే ఈసినిమా. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు ఇన్నాళ్లూ సరైన సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ తో రాబోతుంది. ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు బాబి సింహా. సలార్ సినిమాలో బాబి సింహా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబి సింహా ఈసినిమా ఏప్రిల్ నుండి వెళ్లనుందని తెలియచేశాడు. ఇక బాబి సింహా ఇచ్చిన అప్ డేట్ తో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు.

కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్‌, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =