ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మార్చి 8వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు పాటలను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. స్పిరిట్ ఆఫ్ గామి పేరుతో శివమ్ అంటూ వచ్చే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.
చావైనా సిద్ధం శివం 🔥
ప్రాణంకై యుద్ధం శివం ❤️🔥#Shivam – The spirit of #Gaami Full song out now ✨
▶️ https://t.co/CfBsskc8a4Sung by @Shankar_Live 🎧
Grand release worldwide on March 8th 🧿@VishwakSenActor @iChandiniC @KarthikSabaresh @nanivid @mgabhinaya #NareshKumaran… pic.twitter.com/u1al3XWCrF
— UV Creations (@UV_Creations) March 4, 2024
కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























