జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది 

jai hanuman first look poster come soon

ఈసంక్రాంతి కి చిన్న సినిమాగా వచ్చి చరిత్ర సృష్టించింది హనుమాన్.స్టార్ హీరోల పేరిట వున్న రికార్డులు బద్దలు కొట్టి సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా రికార్డు ను కూడా ఖాతాలో వేసుకుంది అంతేకాదు ఆర్ ఆర్ ఆర్,బాహుబలి 1&2 తరువాత అత్యధిక లాభాలను తెచ్చిన సినిమాగా రికార్డు క్రీయేట్ చేసింది.ఏకంగా 100కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది ఈసినిమా.ప్రపంచ వ్యాప్తంగా 300కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్నటితో ఈసినిమా 50రోజులను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసందర్భంగా హనుమాన్ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.ఈమీట్ లో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  మాట్లాడుతూ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పనులు స్టార్ట్ అయ్యాయని త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని తెలిపాడు.జై హనుమాన్ లో హనుమాన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరో ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

ఇక హనుమాన్ త్వరలోనే చైనీస్ ,జపనీస్ ,స్పానిష్ లోకూడా విడుదలకానుంది.ఇందుకోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్ల తో కూడా మాట్లాడం జరిగిందని ప్రశాంత్ వర్మ అన్నారు.హనుమాన్ లో తేజ సజ్జా హీరోగా నటించగా  అతనికి జోడిగా అమృతా అయ్యర్ కనిపించింది.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.ఇక ఈసినిమా ఈనెల 8న జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ లోకి రానుందని సమాచారం అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.