కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 151

Director Harish Shankar and Producer Ravi Shankar Helped A Vehicle on Road, Video Goes Viral
సినిమా వార్తలు

రోడ్డుపై ఆగిపోయిన కారు.. సాయపడిన హరీష్ శంకర్, నిర్మాత రవి శంకర్

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. తన సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు అందిస్తుంటారు. అలాగే నెటిజెన్లు, అభిమానులు కూడా ఆయనను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజెన్లు హరీష్ శంకర్‌కి సంబంధించిన ఒక వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవి శంకర్ ఇరువురూ కలిసి కారులో వెళ్తుండగా ఓ చోట రోడ్ మధ్యలో ఆగిపోయిన కారు ఒకటి కనిపించింది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి నెలకొంది.

Srikanth Mవాట్సాప్
kubera movie bangkok schedule update
షూటింగ్ అప్‌డేట్

కుబేర బ్యాంకాక్ షెడ్యూల్ షురూ

కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ డీఎస్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోగా రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. కుబేర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Rockstar Devi Sri Prasad Gets Blessings of Isaignani Ilaiyaraaja
సినిమా వార్తలు

దేవిశ్రీ ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా, ఫొటోస్ వైరల్

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు అందుకున్నారు. ఈ మేరకు తన స్టూడియోకు విచ్చేసిన సందర్భంగా తాను దైవంలా, గురువులా భావించే ఇసైజ్ఞాని ఇళయరాజాకు దేవిశ్రీ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిసారి తన స్టూడియోకు వచ్చిన సంగీత బ్రహ్మకు దగ్గరుండి స్టూడియో అంతటినీ తిప్పి చూపించారు. ఈ క్రమంలో స్టూడియోలో తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్న ఇళయరాజా భారీ ఫోటోను ఆయనకే చూపించి ఆశ్చర్యపరిచారు. అలాగే ఆ ఫోటో ముందు ఇళయరాజాతో కలిసి ఫోటో దిగారు. ఈ సందర్భంగా తన జీవిత కల నెరవేరిందని దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను రాక్ స్టార్ సోషల్ మీడియా వేదికగా…

Srikanth Mవాట్సాప్
Prabhas domination continues on X
సినిమా వార్తలు

ఎక్స్ లో ప్రభాస్ డామినేషన్

రెబల్ స్టార్ ప్రభాస్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.డిజాస్టర్ టాక్ తో కూడా 100కోట్ల ఓపెనింగ్స్ ను తెచ్చేపెట్టే హీరో.ఇక హీరో సోషల్ మీడియాలో కూడా రికార్డులు క్రీయేట్ చేస్తున్నాడు.గత ఏడాదికి గాను ఎక్స్ ఇండియాలో టాప్ 10 యాష్ ట్యాగ్ లను ప్రకటించగా ఇందులో ప్రభాస్ 7వస్థానాన్ని సంపాదించుకున్నాడు అంతేకాదు ఆ ఏడాది ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు.

Mahender Reddyవాట్సాప్
gopichand malineni new movie update
సినిమా వార్తలు

గోపిచంద్ మలినేని -మైత్రి మూవీ అప్డేట్

క్రాక్,వీరసింహా రెడ్డి తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ సినిమాలను ఇచ్చాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.ఇంత సూపర్ ఫామ్ లో వున్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ విషయం లో మాత్రం ఆలస్యం అవుతుంది.వీరసింహా రెడ్డి తరువాత మైత్రి మూవీస్ లోనే గోపీచంద్ మలినేని,రవితేజతో సినిమా చేయనున్నాడని అనౌన్స్మెంట్ వచ్చింది.అయితే ఎందుకో తెలియదు షూటింగ్ కు కూడా వెళ్లకముందే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది దాంతో ఆ ఆతరువాత గోపిచంద్ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కు కథ వినిపించి ఓకే చేయించుకున్నాడని మైత్రినే ఈసినిమా నిర్మించనుందని వార్తలు వచ్చాయి అయితే దీనిపై ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Mahender Reddyవాట్సాప్
Om Bheem Bush Movie Trailer Release Date Fixed
ట్రైలర్ & టీజర్

ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఓం భీమ్ బుష్'. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా 'ఓం భీమ్ బుష్' మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
vishwambhara song shoot is complete
సాంగ్

విశ్వంభర సాంగ్ షూట్ కంప్లీట్

మెగాస్టార్ చిరంజీవి- బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అవ్వగా పెద్దగా బ్రేక్ లేకుండా షెడ్యూల్ లను కంప్లీట్ చేస్తున్నారు.అందులో భాగంగా తాజాగా ఈసినిమాలో ఒక సాంగ్ ను చిత్రీకరించారు.ఈసాంగ్ కు నా సామి రంగ దర్శకుడు విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేశాడు.ఈ సందర్భంగా నా కల నెరవేరింది బ్యూటీఫుల్ సాంగ్ కోసం మెగాస్టర్ కు కొరియోగ్రఫీ చేశా అని తన ఆనందాన్ని ఇంస్టా గ్రామ్ ద్వారా పంచుకున్నాడు విజయ్ బిన్నీ.

Mahender Reddyవాట్సాప్
Shine Tom Chacko on board for NBK109
సినిమా వార్తలు

ఎన్ బి కె 109లో దసరా విలన్

వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి సూపర్ ఫామ్ లో వున్నాడు దర్శకుడు బాబీ.ఈ డైరెక్టర్ ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు.అదే ఎన్ బి కె 109(వర్కింగ్ టైటిల్).రీసెంట్ గా చిన్న గ్లింప్స్ ను కూడా వదిలారు.ఈసినిమా బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందని ఆగ్లింప్స్ చూస్తే తెలుస్తుంది.ఇక మేకర్స్ ఈసినిమా క్యాస్టింగ్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు.ఇప్పటికే విలన్ పాత్రకు బాబీ డియోల్ ను తీసుకోగా దుల్కర్ సల్మాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్.

Mahender Reddyవాట్సాప్
SS Karthikeya Responds Over Mahesh Babu's Review on Premalu Movie
సినిమా వార్తలు

మహేష్ బాబు ప్రేమలు రివ్యూ పై కార్తికేయ సూపర్ రిప్లై

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'ప్రేమలు' మూవీ తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు, ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ దీనిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మూవీని చూసి స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్రంపై రివ్యూ ఇచ్చారు. ఒక సినిమా చూస్తూ, చివరిసారి ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదని, అంతగా ఈ చిత్రం తనను ఆకట్టుకుందని ప్రశంసలు కురిపించారు.

Srikanth Mవాట్సాప్
Om Bheem Bush Director Sree Harsha Reveals Interesting Facts About Movie
సినిమా వార్తలు

'ఓం భీమ్ బుష్'.. టైటిల్‌కి అర్ధం ఏంటంటే? డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్'తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'ఓం భీమ్ బుష్' మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
prabhas readying for raja saab movie shooting
షూటింగ్ అప్‌డేట్

రాజా సాబ్ కోసం రెడీ అవుతున్న ప్రభాస్

రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఆదిశగానే పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kalyani Vaccha Vacchaa full song out From Family Star movie
సాంగ్

ఫ్యామిలీ స్టార్- కలర్ ఫుల్ కళ్యాణి వచ్చా వచ్చా ఫుల్ సాంగ్ రిలీజ్

విజయ్‌ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ముందుగా రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమానే. ప్రస్తుతం అయితే చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటూనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Allari Naresh Aa Okkati Adakku Teaser Released
ట్రైలర్ & టీజర్

ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్

టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తుండగా.. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
vishwak sen interesting post on gaami movie rating issue
సినిమా వార్తలు

గామి రేటింగ్ తగ్గడం పై విశ్వక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

విధ్యాధర కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా గామి. ఈసినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈసినిమా 22 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే సక్సెస్ ఫుల్ గా థియేటరల్లో రన్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Premalu Telugu continues its good run at the box office
బాక్సాఫీస్

ప్రేమలు తెలుగు లోకూడా సత్తా చాటుతుంది

చిన్న సినిమాగా వచ్చిన ప్రేమలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుంది.గత నెలలో మళయాలం లో విడుదలైన ఈసినిమా విడుదలై 30రోజులు దాటినా ఇప్పటికీ సూపర్ హోల్డ్ తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో ఈ ఫీట్ సాధించిన 5వ మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Salman Khan Joins with Murugadoss and Sajid Nadiadwala For A New Film
సినిమా వార్తలు

మురుగదాస్‍ డైరెక్షన్‍లో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' చిత్రంతో గతేడాది మంచి హిట్ అందుకున్నారు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్‍ కత్రినా కైఫ్ కథానాయికగా నటించగా.. ఇమ్రాన్ హష్మి విలన్‍గా కనిపించారు. దేశభక్తి కథాంశంగా రూపొందిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ వరుసగా సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఆయన తాజాగా తన తదుపరి చిత్రానికి సంబంధించి కీలక అప్‌డేట్ అందించారు.

Srikanth Mవాట్సాప్
nbk 109 movie in action mode
సినిమా వార్తలు

భారీ యాక్షన్ మోడ్ లో NBK 109

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ గా ఉన్న గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
devara shooting update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర కొత్త షెడ్యూల్ ఈనెల 19నుండి గోవాలో ప్రారంభం కానుంది.ఈ షెడ్యూల్ లో విలన్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొననున్నాడు.గాయం నుంచి కోలుకున్న సైఫ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.దేవర షూటింగ్ లోనే సైఫ్ గాయపడిన విషయం తెలిసిందే దాంతో ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకోగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.ఇక ఈసినిమా రెండు భాగాలుగా రానుంది అందులో భాగంగా మొదటి భాగం అక్టోబర్ 10న విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Sundeep Kishan Announced His 30th Film Working Title SK30
సినిమా వార్తలు

సందీప్ కిషన్‌ 30వ సినిమా అనౌన్స్‌మెంట్

'ఊరు పేరు భైరవకోన' సినిమా బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్‌.. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన తదుపరి ప్రాజెక్టు గురించి కీలక ప్రకటన చేశారు. దీనిలో భాగంగా మంగళవారం తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. 'ధమాకా' వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని #SK30 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishwak Sen's Gaami Movie Grosses 22.5 Cr Worldwide in 4 Days
బాక్సాఫీస్

కొనసాగుతున్న గామి జైత్రయాత్ర, 4 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా వి సెల్యులాయిడ్ సమర్పణలో మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. క్రౌడ్ ఫండ్ చేసిన ఈ ఈ మూవీలో తెలుగమ్మాయి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. ట్రైలర్ తర్వాత మంచి బజ్ ఏర్పడటంతో విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్టే రిలీజైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

Srikanth Mవాట్సాప్

షేర్