ఎక్స్ లో ప్రభాస్ డామినేషన్ 

Prabhas domination continues on X

రెబల్ స్టార్ ప్రభాస్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.డిజాస్టర్ టాక్ తో కూడా 100కోట్ల ఓపెనింగ్స్ ను తెచ్చేపెట్టే హీరో.ఇక హీరో సోషల్ మీడియాలో కూడా రికార్డులు క్రీయేట్ చేస్తున్నాడు.గత ఏడాదికి గాను ఎక్స్ ఇండియాలో టాప్ 10 యాష్ ట్యాగ్ లను ప్రకటించగా ఇందులో ప్రభాస్ 7వస్థానాన్ని సంపాదించుకున్నాడు అంతేకాదు ఆ ఏడాది ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మూవీస్ విషయానికి వస్తే 2023లో ఎక్స్ లో ఎక్కువగా ఏ సినిమాల గురించి చర్చించుకున్నారో అనే విభాగంలో టాప్ 8 మూవీస్ ను ప్రకటించగా ఇందులో ప్రభాస్ రెండు సినిమాలు వున్నాయి అందులో సలార్ రెండో స్థానం లో ఉండగా ఆదిపురుష్ అరవ స్థానంను కైవసం చేసుకుంది.ఓవరాల్ గా చూస్తే దళపతి విజయ్ నటించిన లియో మొదటి స్థానం లో ఉండగా వారిసు, తునీవు ,జవాన్ ,పఠాన్ ,డంకి తురువాతి స్థానాల్లో చోటు సంపాదించాయి.మొత్తానికి ప్రభాస్ తన క్రేజ్ తో టాలీవుడ్ నుకూడా పోటీలో ఉంచగలిగాడు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా వున్నాడు అందులో కల్కి 2898 ఏడి ఒకటి. ఈసినిమా మే 9న విడుదలకానుంది ఈసినిమా తోపాటు రాజా సాబ్ లోకూడా నటిస్తున్నాడు.ఇవిగాక సలార్ 2, స్పిరిట్ సినిమాలు లైన్ లో వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + two =