చిన్న సినిమాగా వచ్చిన ప్రేమలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుంది.గత నెలలో మళయాలం లో విడుదలైన ఈసినిమా విడుదలై 30రోజులు దాటినా ఇప్పటికీ సూపర్ హోల్డ్ తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో ఈ ఫీట్ సాధించిన 5వ మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత వారం అదే టైటిల్ తో తెలుగులో విడుదలచేయగా ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.మొదటి రోజు స్లో గా స్టార్ట్ అయినా మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటుంది.4రోజుల్లో ఈసినిమా 3కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈవారం కూడా పెద్ద సినిమాలు ఏవి విడుదలకావడం లేదు కాబట్టి ఫుల్ రన్ లో ప్రేమలు 10కోట్ల వరుకు వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది.
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ కావడం అలాగే డైలాగ్స్ హిలేరియస్ గా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.మమితా బైజు,నస్లేన్,సంగీత్ ప్రతాప్, అఖిల బార్గవన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను గిరీష్ ఎడి డైరెక్ట్ చేశాడు.ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. తెలుగులో ఈసినిమాను ఎస్ ఎస్ కార్తికేయ విడుదలచేశాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: